Begin typing your search above and press return to search.

లాస్ ఏంజెల్స్ బీచ్ లో స‌న్నీలియోన్ చిలౌట్

By:  Tupaki Desk   |   17 Aug 2020 5:00 AM IST
లాస్ ఏంజెల్స్ బీచ్ లో స‌న్నీలియోన్ చిలౌట్
X
కరోనావైరస్ మహమ్మారి సమయంలో స‌న్నీలియోన్ కుటుంబం లాస్ ఏంజిల్స్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఇటీవలి ఇంటర్వ్యూలో సన్నీ లియోన్ వివరించింది. ముంబైని విడిచిపెట్టినందుకు విచారంగా ఉన్నా.. వెళ్లేందుకు ఇష్టం లేక‌పోయినా.. డేనియ‌ల్ త‌ల్లిని త‌న కుటుంబాన్ని ద‌గ్గ‌రుండి చూసుకునేందుకు ఈ సాహ‌సం చేశాను! అని తెలిపింది స‌న్నీ. లాస్ ఏంజెల్స్ కి రావాలని నిర్ణయించుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది. అయితే ఈ ప్ర‌యాణం చాలా ముఖ్యమైనది.. ఇత‌రుల్లానే మేము కూడా ప్రియమైనవారితో ఉండాలని కోరుకున్నాం అని తెలిపింది.

లాస్ ఏంజిల్స్‌లో సన్నీ లియోన్ త‌న‌ భర్త డేనియల్ వెబెర్ తో లైఫ్ ఎలా ఉందో ఇటీవ‌ల కొన్ని ఫోటోలు సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ అయ్యాయి. సన్నీ -డేనియల్ ఇద్దరూ బీచ్ ‌లో నడుస్తున్న చిత్రాలను పోస్ట్ చేశారు. ఎంతో అన్యోన్య‌మైన దాంప‌త్యాన్ని ఆస్వాధిస్తున్నామ‌ని ఆవిష్క‌రించే ప్రూఫ్ ఇద‌ని చెప్పాలి. ఈ జంట ఎంతో ఆహ్లాదంగా హార్ట్ ఫుల్ గా నవ్వుతూ ఆ ఫోటోలో క‌నిపించారు.

LA జీవితం .. డేనియ‌ల్ తో బీచ్ లైఫ్‌! అంటూ స‌న్నీ ఆనందం వ్య‌క్తం చేశారు. భర్త డేనియల్ .. పిల్లలు ఆషర్.. నోహ్ .. నిషాతో కలిసి కొన్ని నెలల క్రితం అమెరికాకు వెళ్లిన సన్నీ లియోన్ తన లాస్ ఏంజిల్స్ డైరీ నుండి తన ఇన్ ‌స్టాగ్రామ్ లో నిరంత‌రం ఎన్నో విశేషాల్ని అభిమానుల‌తో పంచుకుంటున్నారు.

టెలివిజన్ రియాలిటీ షో `బిగ్ బాస్ సీజన్ 5` తో సన్నీ లియోన్ భారతీయ వినోద రంగంలోకి అడుగుపెట్టింది. జిస్మ్ 2- హేట్ స్టోరీ 2- రాగిణి ఎంఎంఎస్ 2 - ఏక్ పహేలీ లీలా చిత్రాలతో చ‌క్క‌ని విజ‌యాల్ని అందుకుంది. చివరిసారిగా టీవీ రియాలిటీ షో స్ప్లిట్స్‌విల్లాలో హోస్ట్ గా కనిపించింది. ప్ర‌స్తుతం బిజీ లైఫ్ నుంచి బ‌య‌ట‌ప‌డి భ‌ర్త కుటుంబ‌మే ప్ర‌ధానంగా జీవిస్తోంది. సౌంద‌ర్య ఉత్ప‌త్తుల కంపెనీని ప్రారంభించి అభివృద్ధి చేస్తోంది.