Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో మ‌ళ్లీ స‌న్నీలియోన్ దుమారం

By:  Tupaki Desk   |   13 July 2021 6:00 AM IST
టాలీవుడ్ లో మ‌ళ్లీ స‌న్నీలియోన్ దుమారం
X
బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ టాలీవుడ్ కి సుప‌రిచితం. ఇంత‌కుముందు మంచు మ‌నోజ్ `క‌రెంట్ తీగ` చిత్రంలో స్పెష‌ల్ పాత్ర స్పెష‌ల్ నంబ‌ర్ తో యువ‌త‌రాన్ని ఉర్రూత‌లూగించింది. స‌న్నీ టీచ‌ర్ తో మ‌నోజ్ రొమాన్స్ ఆక‌ట్టుకుంది. సౌత్ లో ఇత‌ర భాష‌ల్లోనూ చాలా ప్రత్యేక ఐటెమ్ నంబర్ల లో క‌నిపించింది.

కన్నడ సినిమాలు డికె- లవ్ యు అలియాలో ఐటమ్ నంబర్లు చేసింది. త్వ‌ర‌లో రానున్న‌ కన్నడ చిత్రం కోటిగోబ్బా 3 లో డాన్స్ నంబర్ కూడా చేసింది. కొంత గ్యాప్ తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమలోకి స‌న్నీ తిరిగి రాబోతోంది. వై.రాజ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న `కాటన్ పేట్ గేట్` చిత్రంలో ఆమె ప్రత్యేక డాన్స్ నంబర్ చేయనుంది. ఈ చిత్రాన్ని తెలుగులో `సీతన్నపేట్ గేట్`గా కూడా తీస్తున్నారు.

ఈ కొత్త పాట షూటింగ్ ఈ నెలాఖరులోగా హైదరాబాద్ లో ప్రారంభమవుతుంది. అంతకుముందు మేకర్స్ దీనిని మార్చిలో చిత్రీకరించాలని అనుకున్నారు. కాని కరోనావైరస్ రెండవ వేవ్ అన్ని ప్రణాళికలను నాశనం చేసింది. ఈ చిత్రంలో యశ్వాన్- వేణు- కిస్లే చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు. స‌న్నీ ప్రత్యేక పాట సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కానుంది. ఎన్‌.ఎస్ ప్రసు స‌న్నీ స్పెష‌ల్ పాట‌ ట్రాక్ ని సమకూర్చారు. జిస్మ్ 2తో మొద‌లైన స‌న్నీలియోన్ కెరీర్ ఇటీవ‌ల మ‌ళ్లీ యష్ రాజ్ సంస్థ ఆఫ‌ర్ల‌తో రీబూట్ అవుతోంది.