Begin typing your search above and press return to search.

మరో హీరో వారసుడు వస్తున్నాడు!

By:  Tupaki Desk   |   25 Aug 2016 4:57 PM IST
మరో హీరో వారసుడు వస్తున్నాడు!
X
డాక్టర్ కొడుకు డాక్టర్, ఇంజినీర్ కొడుకు ఇంజినీర్ అవుతున్నారో లేదో కానీ.. రాజకీయాల్లోనూ - సినిమాల్లోనూ మాత్రం వారసుల హడావిడి ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటికే ఒక తరం నటీనటులు - హీరోలు వారి వారి పుత్ర రత్నాలను తెరపైకి తీసుకువచ్చేశారు. వారిలో కొంతమందిని సక్సెస్ అయ్యేవరకూ జనాలపై రుద్ది మరీ సక్సెస్ చెయ్యిస్తే, మరి కొందరికి ఆ స్థోమతలేకో మరేమో కానీ మొదటి ఒకటి రెండు ప్రయత్నాల్లోనే సైడ్ చేసేశారు. వీరందరి సంగతి కాసేపు పక్కన పెడితే... తాజాగా మరో బాలీవుడ్ హీరో వారసుడు తెరంగేట్రం చేయబోతున్నాడు.

సీనియర్ నటుడు సన్నిడియోల్ తన కుమారుడు కరణ్ ను హీరోగా పరిచయం చేయాలని భావిన్నాడట. దీనికోసం చాలా కథలను విన్న సన్నీ.. ఇక కొత్త కథలకోసం - వాటిలో మంచి కథల కోసం ఎదురుచూడటం కష్టం అని భావించి 30 ఏళ్ల క్రితం తనకు తొలి విజయాన్ని అందించిన "బెతాబ్" సినిమానే తన కుమారుడు కరణ్ తో రీమేక్ చేయాలని కోరుకుంటున్నాడట. ఎవరు ఎన్ని కథలు వినిపించినా అవేమీ నచ్చకపోవడంతో సన్నీ "బెతాబ్"కే ఫిక్సయినట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో కరణ్ సరసన హీరోయిన్ గా సైఫ్ అలీఖాన్ - అమృతా సింగ్ ల కూతురు సారాను ఎంపిక చేయాలని ప్రయత్నిస్తున్నాడట. అయితే ఇప్పటికే సారా.. ధర్మా ప్రొడక్షన్ లో కరణ్ జోహర్ నిర్మించనున్న సినిమాతో ఆమె తెరంగ్రేటం చేయనుంది. దీంతో శ్రీదేవి కూతురు జాహ్నవి అయితే కరణ్ కు జోడీగా బాగుంటుందని భావించిన సన్నీ ఆ ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం. కాగా సన్నీ డియోల్ తొలి సినిమాలో అతడి సరసన అమృతా సింగ్ నటించింది.