Begin typing your search above and press return to search.

లండన్ విధుల్లో అడ్డంగా దొరికారు

By:  Tupaki Desk   |   27 Sep 2017 4:56 PM GMT
లండన్ విధుల్లో అడ్డంగా దొరికారు
X
సాధారణంగా సీనియర్ తారలు కలుసుకున్నప్పుడు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. అప్పట్లో జరిగిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ సంతోషపడతారు. కానీ ఎక్కడికి వెళ్లినా గాసిప్స్ వెంటాడుతూనే ఉంటాయి. కొంచెం క్లోజ్ గా ఉన్నాసరే కొన్ని మీడియాల్లో ప్రత్యేక కథనాలు వెలువడతాయి. ఫోటో తేడా వచ్చినా వీడియో తేడా వచ్చినా బ్రేకింగ్ న్యూస్ లతో సెన్సేషన్ ని క్రియేట్ అవుతుంది.

అయితే ఆ బ్రేకింగ్ న్యూస్ లకు మారోసారి ప్రాణం పోసినట్టు క్లోజప్ లో దొరికిపోయారు అలనాటి తారలు. వారు ఎవరో కాదు 90 లలో మంచి జోడిగా గుర్తింపు పొందిన బాలీవుడ్ స్టార్స్ సన్నీడియోల్ - డింపుల్ కపాడియాలు. అప్పట్లో వీరి ప్రతి కలయికపై అనేక రూమర్స్ వెలువడ్డాయి. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం బాగా నడుస్తోందనే వార్తలు వెలువడ్డాయి. అయితే డింపుల్ కపాడియా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నప్పుడు అగ్ర నటుడైన రాజేష్ ఖన్నాను వివాహం చేసుకొని ఆ రూమర్స్ కి పులి స్టాప్ పెట్టె ప్రయత్నం చేశారు. కానీ చాలా రోజుల తర్వాత మళ్లీ వీరిద్దరూ ఒకటయ్యారు. లండన్ విధుల్లో షికారు చేస్తున్నారు. చేయి చేయి కలుపుతూ.. ప్రేమగా మాట్లాడుకున్నారు. దానికి సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

అయితే ఆ వీడియోను క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ సోషల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. దీంతో అనేక రకాలుగా కామెంట్స్ వినబడుతున్నాయి. ప్రేమ పక్షులు మళ్లీ ఒకటయ్యాయని కామెంట్స్ చేస్తున్నారు. డింపుల్ కపాడియా భర్త రాజేష్ ఖన్నా 2012 లో మరణించారు. ఆ తర్వాత సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది కపాడియా. ఇక సన్నీ డియోల్ కొన్ని హిందీ సినిమాల్లో నటిస్తున్నాడు.