Begin typing your search above and press return to search.

కెప్టెన్ అయిన సన్నీ.. ఆనీకి ముద్దులు ప్రియాతో రాజీ

By:  Tupaki Desk   |   23 Oct 2021 4:35 AM GMT
కెప్టెన్ అయిన సన్నీ.. ఆనీకి ముద్దులు ప్రియాతో రాజీ
X
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ఏడో కెప్టెన్ గా సన్నీ నిలిచాడు. మొదటి వారం నుండి కెప్టెన్సీ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న సన్నీకి ఎట్టకేలకు అవకాశం దక్కింది. కెప్టెన్ అయితే ధరించాలని తెచ్చుకున్న ఒక డ్రస్ ను తాజా ఎపిసోడ్ లో ధరించి మరీ కెప్టెన్సీ బ్యాండ్‌ ను పెట్టుకున్నాడు. బిగ్ బాస్ కెప్టెన్‌ అయిన సన్నీ ఇంటి సభ్యులందరితో కూడా సన్నిహితంగా అందరికి సహకారం అందిస్తూ తన కెప్టెన్సీ కొనసాగిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. కెప్టెన్‌ అయిన సన్నీ రేషన్‌ మేనేజర్ గా కాజల్‌ ను ఎంపిక చేసుకోవడం జరిగింది. కాజల్‌ కూడా కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచింది కాని ఆమెకు విజయం దక్కలేదు. సన్నీ మొదటి సారి కెప్టెన్‌ అవ్వడంతో ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక తాజా ఎపిసోడ్‌ త్రిమూర్తుల మద్య ఎమోషనల్‌ సన్నివేశాలతో మొదలు అయ్యాయి. గత ఎపిసోడ్‌ లో అలిగి కన్నీరు పెట్టుకున్న షన్ను తిరిగి మామూలు అయ్యాడు. సిరి మరియు జెస్సీలతో షన్ను కలిసి పోయాడు. అలిగి కూర్చున్న సిరికి షన్ను తినిపించడం చాలా క్యూట్‌ గా అనిపించింది. మళ్లీ ముగ్గురు కలవడం జరిగింది. ఆ తర్వాత ఒకొక్కరు తమ జీవితంలో సాధించిన అచీవ్మెంట్స్ మరియు తమ ఫ్యామిలీ గురించి చెప్పడం జరిగింది. ఆ సమయంలో జెస్సీ మరియు సిరిలు చెప్పిన విషయాలు ఎమోషనల్‌ గా ఉన్నాయి. ఇక కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా కెప్టెన్సీ కంటెండర్స్ నడుముకు బెలూన్ కట్టుకుని ఉంటారు. ఒక సూదిని బిగ్ బాస్‌ ఇవ్వడం జరిగింది. ఆ సూదిని ఇంటి సభ్యులు బజర్‌ మోగిన సమయంలో పరుగెత్తుకుంటూ వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సూది తమకు ఇష్టమైన కెప్టెన్సీ కంటెండ్ కు ఇవ్వాల్సి ఉంటుంది. అలా మొదట బజర్ మోగిన వెంటనే సూదిని జెస్సీ అందుకుని కాజల్‌ కు అందిస్తాడు. ఆమె విశ్వ బెలూన్ పగులకొట్టేస్తుంది. ఆ తర్వాత విశ్వ సూదిని అందుకుని రవికి ఇస్తాడు. అతడు మానస్ బెలూన్ ను పగులగొట్టేస్తాడు. ఆ తర్వాత లోబోకు సూది లభిస్తుంది. లోబో కూడా రవికి ఇవ్వగా అప్పుడు కాజల్ బెలూన్ ను రవి పగులగొడతాడు. చివరగా సూది ఆనీ మాస్టర్ కు లభిస్తుంది. ఆమె సన్నీకి ఇస్తుంది. రవి బెలూన్ ను సన్నీ పగులకొట్టేస్తాడు. అలా ఏడవ కెప్టెన్‌ గా సన్నీ నిలిచాడు.

తనకు చివర్లో సూది ఇచ్చినందుకు ఆనీ మాస్టర్‌ కు అందరు చూస్తుండగా సన్నీ గట్టిగా ముద్దు పెట్టేశాడు. సెన్సార్ ఇబ్బంది ఉంది లేదంటే ఇంగ్లీష్‌ కిష్‌ ఇచ్చే వాడిని అంటూ సరదాగా సన్నీ అనేశాడు. మొత్తానికి ఆనీ వల్ల కెప్టెన్‌ అయిన సన్నీ ఆమె పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఇక కెప్టెన్‌ అయిన తర్వాత ప్రియా వద్దకు వెళ్లిన సన్నీ ఇప్పటి వరకు జరిగిన గొడవలను పక్కకు పెట్టేయాలని.. మీకు ఏ పని కంఫర్ట్‌ గా ఉంటుందో ఆ పని చేయాలంటూ సూచించాడు. అప్పుడు ప్రియా నవ్వుతూ సమాధానం చెప్పింది. అంతకు ముందు కూడా సన్నీని కవ్వించినట్లుగా ప్రియా మాట్లాడటం.. తాను తాగిన కప్పును అతడితో కడిగించడం చేసింది. ఇకపై సన్నీ ఏమైనా గొడవ పడితే కన్ను కొట్టి ముద్దు పెట్టినట్లుగా చేస్తే సైలెంట్ అవుతాడేమో అంటూ ప్రియా సరదాగా వ్యాక్యలు చేసింది. ఈవారంలో మొదటి రెండు రోజులు రచ్చ చేసిన ప్రియా ఇప్పుడు మాత్రం చాలా కూల్‌ అయ్యింది. మరి శనివారం ఎపిసోడ్ లో ప్రియా ను నాగార్జున ఎలా డీల్ చేస్తాడు అనేది చూడాలి.