Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: అసలైన ఆనందం

By:  Tupaki Desk   |   10 Nov 2017 5:30 AM GMT
ఫోటో స్టోరి: అసలైన ఆనందం
X
యుద్ధంలో కత్తికి చంపడం తప్ప మరేమీ తెలియదు అనే విధంగా సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ ఎవ్వరిని వదలకుండా ఎటాక్ చేస్తాయి అనేది అబద్ధం లేని నిజం. అయితే రూమర్స్ కొందరు లైట్ అని వదిలేస్తారు. కొందరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. అటువంటి వారిలో సింగర్ సునీత ఒకరని చెప్పాలి. ఎలాంటి అడ్డంకులు వచ్చినా తన కెరీర్ ను పాజిటివ్ గా కొనసాగించారు.

ఆమె పాటలను ఇష్టపడే వారు ఎవ్వరైనా ఆమెను వ్యక్తిగతంగా ఎంతో గౌరవిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో ఆమె కొన్ని షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు సునీత బాగానే కనిపిస్తుంది. రీసెంట్ గా తన పిల్లలతో (ఆకాష్ - శ్రేయ) దిగిన ఒక ఫోటోని సునీత తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఇద్దరు చాలా పెద్దవారై పోయారు. ఇక వారే నా జీవితానికి అసలైన ఆనందం అనేలా కామెంట్ కూడా చేశారు ఈ గాన కోకిల.

ప్రస్తుతం సునీత తన ఇద్దరి పిల్లలతోనే ఉంటోంది. 19 ఏళ్లకు పెళ్లి చేసుకున్న ఆమె కొన్నేళ్లకే భర్త నుండి సపరేట్ గా ఉంటున్నారనేది టాక్. అయితే సునీత పోస్ట్ చేసిన ఫొటో చూసినవారంతా చాలా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. అంతే కాకుండా ఆమె మథర్ లా లేదు అని వారికి ఒక సిస్టర్ లా ఉన్నారని కామెంట్ చేస్తున్నారు.