Begin typing your search above and press return to search.
2 కోట్ల నుంచి 2 లక్షలకు పడిపోయిన సునీల్ వ్యాల్యూ
By: Tupaki Desk | 4 March 2020 11:00 AM ISTసునీల్...ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా ఓ వెలుగు వెలిగాడు. టాలీవుడ్ లోని యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరి సినిమాల్లోనూ సునీల తన కామెడీతో నవ్వులు పూయించాడు. కమెడియన్ గా తన కెరీర్ పీక్ టైంలో ఉన్నపుడు సునీల్....హీరోగా తన లక్ ను టెస్ట్ చేసుకోవానుకున్నాడు. `అందాల రాముడు`తో అరంగేట్రం చేసిన సునీల్....`మర్యాద రామన్న`తో ఫుల్ టైం హీరోగా మారిపోదామని డిసైడ్ అయ్యాడు. అయితే, ఆ తర్వాత చాలా సినిమాల్లో హీరోగా నటించిన సునీల్...చెప్పుకోదగ్గ హిట్ లు సాధించలేదు. దీంతో, మళ్లీ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్.. తన పాత ట్రాక్ లో పడ్డాడు. ఇక, కమెడియన్ గా సునీల్ నిలదొక్కుకుంటాడనుకునేలోపే... `డిస్కో రాజా`లో విలన్ గా ఎంట్రీ ఇచ్చి షాకిచ్చాడు. అయితే, హీరో నుంచి విలన్ కు ఛేంజ్ అయిన సునీల్ రెమ్యునరేషన్ కూడా ఛేంజ్ అయింది. హీరోగా రెండు కోట్లు తీసుకున్న సునీల్...ఇపుడు ఒక రోజు ఫుల్ కాల్షీట్ కు రెండు లక్షలు చార్జ్ చేస్తున్నాడట.
డిస్కోరాజా సినిమాలో విలన్ పాత్రలో నటించిన సునీల్ కు మంచి పేరు రావడంతో....ఇకపై విలన్ గా కూడా రాణించాలని సునీల్ డిసైడ్ అయ్యాడట. ఇకపై కమెడియన్ - విలన్ - సపోర్టింగ్ యాక్టర్ ఇలా ఏదైనా చేసి....ఇండస్ట్రీలో పాతుకుపోకోవాలని సునీల్ అనుకుంటున్నాడట. ప్రస్తుతం సునీల్ ‘కలర్ ఫొటో’ సినిమాలో ఎస్సై రామరాజు అనే విలన్ పాత్రలో నటిస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో సునీల్ ఓ కీ రోల్ ప్లే చేస్తున్నాడట. పవన్‌తో పాటు ఎక్కువసేపుండే పాత్రను సునీల్ కోసం క్రిష్ క్రియేట్ చేశాడట. మరి, విలన్ కమ్ కమెడియన్ కమ్ సపోర్టింగ్ యాక్టర్ గా సునీల్ ఎంతవరకు రాణిస్తాడో వేచి చూడాలి. ఓడలు బండ్లవడమంటే ఇదే సునీల్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.