Begin typing your search above and press return to search.
హాస్యనటుడు కం హీరో సునీల్ విలన్ గా మెప్పిస్తాడా?
By: Tupaki Desk | 18 Sept 2020 10:15 AM ISTభూమి గుండ్రంగా తిరిగి అక్కడికే వస్తుందన్నది సైన్స్. మనుషుల నమ్మకం ఏమిటంటే భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి తిరిగి అక్కడికే చేరుకుంటుంది. ఇక చాలా మంది ఫేట్ విషయంలో కూడా ఇదే నిజం. ఇక టాలీవుడ్ నటుల్లో సునీల్ కెరీర్ సంగతి పరిశీలిస్తే అతడు ఆరంభం చిన్న పాత్రలతో పాటు విలనీ చేశారు. కానీ ఆ తర్వాత కమెడియన్ గా రూపాంతరం చెంది అగ్ర హాస్యనటుడిగా టాలీవుడ్ లో మిరాకిల్స్ చేశాడు. ఆ తర్వాత మిగిలినదంతా బోనస్సే.
అసలు సునీల్ హీరో అవుతాడన్నది ఎవరైనా ఊహించారా? కానీ ఊహించనిదే జరిగింది. అవకాశం వచ్చాక హీరోగా రాణించేందుకు సునీల్ పడిన శ్రమ అంతా ఇంతా కాదు. సిక్స్ ప్యాక్ తో షాక్ ల మీద షాకులు తినిపించాడు. అయితే దురదృష్టవశాత్తూ హీరోగా కెరీర్ కొంతవరకే పరిమితమైంది. అయినా ఇది తనకు బోనస్ అని చాలా సందర్భాల్లో సునీల్ చెప్పకనే చెప్పారు.
ఇటీవల తిరిగి క్యారెక్టర్ రోల్స్ లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరో నుంచి మారి తిరిగి తన సాధారణ పాత్రలకు తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఈ ప్రతిభావంతుడైన నటుడు కూడా నెగెటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడు త్వరలో అందుకు సంబంధించిన లుక్ విడుదల కానుందిట. తాజా సంచలనం ఏమంటే.. సునీల్ కొన్ని విలన్ పాత్రల కోసం పెద్ద బ్యానర్లతోనే చర్చలు జరుపుతున్నారని తెలిసింది. విలనీ అంటే కాస్త ఆకారం పరంగా కూడా 6 ప్యాక్ వర్కవుటవుతుందనడంలో సందేహమేం లేదు. కామెడీ విలనీ తనకు బాగానే కలిసొస్తుంది.
అన్నట్టు కెరీర్ ప్రారంభమైంది చిన్న తరహా పాత్రలు విలనీతోనే. ఇప్పుడు తిరిగి విలన్ పాత్రలకు షిఫ్టవుతున్నాడు. అయితే అక్కడ ఏ మేరకు రాణిస్తాడు? తనకంటూ ప్రత్యేకించి ఓ సెక్షన్ ఆడియెన్ ఉన్నారు.. వాళ్లను మెప్పిస్తాడా లేదా? అన్నది చూడాలి. చేయబోయేది సీరియస్ విలనీనా.. కామెడీ విలనీనా? అన్నదానిని బట్టి అతడు ఎలా రాణిస్తాడో అంచనా వేయొచ్చు. మునుపటి కంటే మేకోవర్ పరంగా నటన పరంగా కొత్తగా ఏం చూపిస్తాడు? అన్నది వేచి చూడాల్సిందే.