Begin typing your search above and press return to search.

బాయ్ కాట్ ట్రెండ్ పై స్టార్ హీరో వివ‌ర‌ణ‌

By:  Tupaki Desk   |   12 Aug 2022 4:13 AM GMT
బాయ్ కాట్ ట్రెండ్ పై స్టార్ హీరో వివ‌ర‌ణ‌
X
లాల్ సింగ్ చడ్డా - రక్షా బంధన్ చిత్రాలు ఈ నెల 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమాల రివ్యూల‌ గురించి చ‌ర్చ సాగుతోంది.

అయితే ఈ చిత్రాలను బహిష్కరించాలని చాలా రోజులుగా సోషల్ మీడియాలో ప్రతికూల పోకడలు చూస్తున్న‌వే. ఈ ఇద్దరు స్టార్ల పాత వీడియోలను తవ్వి తీస్తున్న నెటిజనులు ఈ సినిమాలను చూడొద్దని కోరుతున్నారు.

ఈ బాయ్ కాట్ ట్రెండ్ పై మ‌రో సీనియ‌ర్ హీరో సునీల్ శెట్టి ఇప్పుడు స్పందించారు. సినిమా వాళ్లు కష్టపడి పని చేస్తారని వాళ్ల ఉద్దేశాలు బాగానే ఉన్నా ఇలాంటి ప్ర‌చారం అన్యాయమ‌ని అన్నారు.. అమీర్ సంవత్సరానికి ఐదు సినిమాలు చేయగలడని.. అయితే ఐదేళ్లలో ఒక సినిమా చేయాలని భావించాడ‌ని మద్దతు ఇచ్చాడు.

అక్షయ్ గురించి సునీల్ మాట్లాడుతూ.. ప్రేక్షకులను అలరించడానికి నిరంతరం శ్రమిస్తున్న హీరో అత‌డు అని అన్నారు.

ఈ ప్రతికూల ప్రచారాన్ని తాను ద్వేషిస్తున్నానని ఎందుకంటే చాలా మంది సినీ పరిశ్రమ నుండి సంపాదిస్తారు... దానిని నాశనం చేయవద్దని బహిష్కరణ ముఠాను కోరాడు.

సునీల్ శెట్టి ప్ర‌స్తుతం ద‌క్షిణాది సినిమాల్లో స‌హాయ‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.