Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్‌ క్లీనింగ్‌ డ్యూటీ, నాది వంట డ్యూటీ

By:  Tupaki Desk   |   22 April 2019 5:29 AM GMT
త్రివిక్రమ్‌ క్లీనింగ్‌ డ్యూటీ, నాది వంట డ్యూటీ
X
టాలీవుడ్‌ లో ప్రస్తుతం టాప్‌ డైరెక్టర్‌ గా ఉన్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ సినిమాల్లో ఛాన్స్‌ ల కోసం చాలా కష్టపడ్డ విషయం తెల్సిందే. సునీల్‌ మాట పట్టుకుని భీమవరం నుండి హైదరాబాద్‌ కు త్రివిక్రమ్‌ వచ్చేశాడట. కాలేజ్‌ లో స్నేహితులు అయిన సునీల్‌ మరియు త్రివిక్రమ్‌ కష్టాలు కలిసి అనుభవించి సినిమాల్లో ఛాన్స్‌ లు దక్కించుకుని స్టార్స్‌ అయ్యారు. త్రివిక్రమ్‌ టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ అయితే, సునీల్‌ కూడా మంచి కమెడియన్‌ గా రాణించి, ఆ తర్వాత హీరో అయ్యాడు, మళ్లీ ఇప్పుడు కమెడియన్‌ గా చేస్తున్నాడు.

సందర్బం వచ్చిన ప్రతి సారి సునీల్‌ లేదా త్రివిక్రమ్‌ తమ సినిమా కష్టాల గురించి చెబుతూ ఉంటారు, పంజాగుట్టలో రూంలో ఉండి అవకాశాల కోసం తిరిగిన రోజులను వీరిద్దరు కూడా అప్పుడప్పుడు నెమరవేసుకుంటూనే ఉంటారు. పంజాగుట్టలోని వారిద్దరు కలిసి ఉన్న రూంకు ఇంకా కూడా రెంట్‌ కడుతూ ఆ రూంను తమ ఆధీనంలోనే వీరిద్దరు ఉంచుకోవడంను బట్టి వీరిద్దరు గతంకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. తాజాగా సునీల్‌ మరోసారి అప్పటి సంగతులను ఒక ఇంటర్వ్యూలో నెమర వేసుకున్నాడు.

సునీల్‌ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... రూంలో ఉన్న సమయంలో నేను వంట చేస్తే త్రివిక్రమ్‌ గిన్నెలు క్లీన్‌ చేసేవాడు. అతడికి వంట సరిగా రాని కారణంగా మేమిద్దరం కూడా క్లీనింగ్‌, కుక్కింగ్‌ అంటూ డ్యూటీ వేసుకున్నాం. క్లీనింగ్‌ డ్యూటీ చేసి త్రివిక్రమ్‌ తన పనిలో పడితే నేను మాత్రం వంట చేసి తినేందుకు పిలిచేవాడిని అన్నాడు. నేను ఎక్కువగా నాన్‌ వెజ్‌ తినేవాడిని, కాని త్రివిక్రమ్‌ మాత్రం పూర్తిగా శాఖాహారి. అయినా మా ఇద్దరికి అది సమస్య కాలేదు. త్రివిక్రమ్‌ కు రైటర్‌ గా ఛాన్స్‌ లు వస్తున్న సమయంలో హోటల్‌ లో రూం బుక్‌ చేసేవారు. మా రూంలో వండిన శాఖాహారం త్రివిక్రమ్‌ తింటే, హోటల్‌ రూంలో బిర్యానీ ఆర్డర్‌ చేసి నేను తినేవాడిని అంటూ సునీల్‌ గత జ్ఞాపకాలను నెమరవేసుకున్నాడు. మొత్తానికి వీరిద్దరు పడ్డ కష్టంకు పూర్తి ప్రతిఫలం పొందారు.