Begin typing your search above and press return to search.

సునీల్ మళ్లొచ్చాడు.. వాళ్ల సంగతేంటో?

By:  Tupaki Desk   |   30 May 2018 5:00 AM IST
సునీల్ మళ్లొచ్చాడు.. వాళ్ల సంగతేంటో?
X
స్టార్ కమెడియన్ గా టాప్ రేంజ్ ను అనుభవిస్తున్న రోజుల్లోనే.. మర్యాద రామన్న మూవీ ఇచ్చిన కిక్ ను బేస్ చేసుకుని.. హీరోగా కంటిన్యూ కావాలని డిసైడ్ అయ్యాడు సునీల్. రెండు మూడు సినిమాల వరకూ బండి బాగానే నడిచినా.. తర్వాత లెక్క తేడా కొట్టేసింది. వరుస పరాజయాలు వెక్కిరించాయి.

కెరీర్ ను రివ్యూ చేసుకున్న సునీల్.. మళ్లీ కమెడియన్ పాత్రలు చేయాలని డిసైడ్ అయ్యాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందుతోన్న అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంతో హాస్య నటుడిగా తిరిగి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాకు సునీల్ రోల్ కూడా ఒక హైలైట్ అవుతాయనే అంచనాలు ఉన్నాయి. దీంతో పాటు పడిపడి లేచె మనసు అంటూ శర్వానంద్-సాయి పల్లవి జంటగా నటిస్తున్న మూవీలో కూడా సునీల్ కామెడీ చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాల్లో సునీల్ పాత్ర బాగానే క్లిక్ అవుతుందని అంచనాలు ఉన్నాయి.

ఇదే కనుక జరిగితే.. సునీల్ తరహా పాత్రలతో అలరిస్తున్న ఇతర కమెడియన్స్ కు కొంత బ్యాడ్ టైం అనిపించక మానదు. ముఖ్యంగా ఇప్పుడు డిఫరెంట్ మాడ్యులేషన్ తో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకుంటున్న వెన్నెల కిషోర్ కు.. ఛాన్సులు తగ్గవచ్చని అంటున్నారు. ఇతడితో పాటు జబర్దస్త్ కమెడియన్స్.. సప్తగిరి.. ప్రవీణ్ లాంటి కమెడియన్స్ కు కూడా సునీల్ కారణంగా సినిమాలకు గండి పడే ఛాన్స్ ఉందని సినిమా జనాలు అంటున్నారు.