Begin typing your search above and press return to search.
పనైపోయింది అనుకుంటే ప్రతాపం చూపిస్తున్నాడే
By: Tupaki Desk | 14 July 2021 4:12 PM ISTకమెడియన్ గా సునీల్ ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఆఫర్ల కోసం చాలా కష్టపడ్డాడు. ఆ విషయాన్ని తానే స్వయంగా పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కమెడియన్ గా స్టార్ డమ్ తో దూసుకు పోతున్న సమయంలో అనూహ్యంగా సునీల్ కు హీరోగా అవకాశం వచ్చింది. అందాల రాముడు మరియు మర్యాద రామన్న సినిమా ల తర్వాత కమెడియన్ పాత్రలకు సునీల్ గుడ్ బై చెప్పేశాడు. హీరోగా కొన్నాళ్లు చేసిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ లు పడ్డాయి. దాంతో సునీల్ మళ్లీ కమెడియన్ గా మారాలని భావించాడు.
సునీల్ కామెడీ రోల్స్ చేయాలనుకున్న సమయంలో దాదాపుగా ఏడాది పాటు ఆయనకు చిన్నా చితకా ఆఫర్లు తప్ప పెద్దగా సినిమా ఛాన్స్ లే కరువయ్యాయి. అలాంటి సమయంలో సునీల్ మెల్ల మెల్లగా కామెడీ రోల్స్ చేయడంతో పాటు వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ ను చేస్తూ వచ్చాడు. కమెడియన్ అయినా కూడా విలన్ గా నటించేందుకు సిద్దం అయ్యాడు. విలన్ గా విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడం తో సునీల్ మళ్లీ బిజీ అయ్యాడు.
ప్రస్తుతం సునీల్ ఒక వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు విలన్ గా మరియు కమెడియన్ గా కూడా నటిస్తున్నాడు. పుష్ప సినిమా లో సునీల్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని.. మొదటి పార్ట్ లో సునీల్ దే మెయిన్ విలన్ రోల్ అంటున్నారు. సునీల్ మరియు అల్లు అర్జున్ ల మద్య సన్నివేశాలు చాలా ఆసక్తిగా ఉంటాయని పుష్ప విడుదల తర్వాత సునీల్ పూర్తి స్థాయి విలన్ గా మారే అవకాశం ఉందంటున్నారు. మరో వైపు సునీల్ ను మహేష్ బాబుతో తెరకెక్కించబోతున్న సినిమా లో త్రివిక్రమ్ కమెడియన్ గా ఎంపిక చేశాడనే వార్తలు వస్తున్నాయి.
ఇక సునీల్ హీరోగా కూడా చిన్న చిన్న సినిమాలను చేస్తున్నాడు. దాంతో ప్రస్తుతం ఆయన డేట్స్ అస్సలు ఖాళీగా లేవు. హీరోగా సినిమాలు మానేసి కమెడియన్ గా సినిమాలు చేయాలనుకున్న సమయంలో సునీల్ కు చేతిలో కనీసం ఒక్క ఆఫర్ కూడా లేకుండా ఉన్న సందర్బాలు ఉన్నాయి. ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా సునీల్ కెరీర్ ఖతం అన్నారు. సునీల్ హీరోగా చేసి మళ్లీ కమెడియన్ గా చేస్తానంటే ఎవరు మాత్రం చూస్తారంటూ కొందరు కామెంట్స్ చేశారు. కాని ఆయన కష్టపడుతూ ప్రయత్నిస్తూ మళ్లీ బిజీ అయ్యాడు. ఇండస్ట్రీలో ఎప్పుడు.. ఎవరు.. ఎలా.. ఎందుకు బిజీ అవుతారో చెప్పలేమనే సామెత ఉంటుంది. అది సునీల్ విషయంలో మళ్లీ రుజువు అయ్యిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి సునీల్ పూర్వ వైభవంను సంపాదించుకోవడం ఆయన అభిమానులకు మరియు సన్నిహితులకు ఆనందం కలిగించే విషయం. సునీల్ ఒక్క దారిలోనే వెళ్లకుండా విలన్ గా హీరోగా కమెడియన్ గా ఇలా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు ప్రయత్నిస్తున్న కారణంగానే బిజ అయ్యాడు. కనుక ముందు ముందు కూడా ఆయన ఇలాగే వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.