Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ మ్యాన్ లో ఎంత బూతు ఉందో చెప్పి షాకిచ్చాడు

By:  Tupaki Desk   |   28 July 2021 10:30 AM GMT
ఫ్యామిలీ మ్యాన్ లో ఎంత బూతు ఉందో చెప్పి షాకిచ్చాడు
X
బాలీవుడ్ ను ఇప్పుడు బూతు సినిమాల యవ్వారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏ ఇద్దరు కలిసినా.. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల గురించి విపరీతంగా మాట్లాడుకుంటున్నారు. ఇంతకాలం పచ్చి బూతును సైతం రొమాంటిక్ ఖాతాలో వేసేసి సినిమాలు చుట్టేసే వాళ్లంతా ఒళ్లు దగ్గర పెట్టుకొని సినిమాలు తీసే కరెక్షన్ ఒక షురూ అయ్యింది. ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా తీసిన బూతు సినిమాల్ని తిట్టిపోయటమే కాదు.. అతడ్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించటాన్ని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచి పని జరుగుతుందని వ్యాఖ్యానిస్తున్న వారు లేకపోలేదు.

ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి సంబంధం లేని అంశాల వద్దకు రావటం ఆసక్తికరంగా మారింది. తాజాగా బాలీవుడ్ కమెడియన్ సునీల్ పాత్ర రియాక్టు అయ్యారు. రాజ్ కుంద్రా అరెస్టుపై స్పందించిన ఆయన.. అతగాడి దారుణ కార్యకలాపాల్ని బయటపెట్టటంతో పాటు.. అతడ్ని అరెస్టు చేయటాన్ని సమర్థించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ సందర్భంగా ఇటీవల ఓటీటీ ఫ్లాట్ ఫాం మీదకు వదులుతున్న పలు బూతు సినిమాలు.. వెబ్ సిరీస్ ల మీద తనదైన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. రాజ్ కుంద్రా అరెస్టు సరైనదేనన్న ఆయన.. సెన్సార్ లేకపోవటం వల్ల కొందరు పెద్ద తలకాయలు అడ్డగోలు వెబ్ సిరీస్ లు తీస్తున్నారంటూ నిప్పులు చెరిగారు.

ఇలాంటి వారు తీస్తున్న బూతు సినిమాల కారణంగా.. వెబ్ సిరీస్ లు ఇంట్లో వారితోకలిసి చూడలేనంత ఘోరంగా తయారవుతున్నాయన్నారు. ఈ సందర్భంగా ఇటీవల పెద్ద ఎత్తున సక్సెస్ అయిన 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ ను ఏకిపారేశాడు. మనోజ్ బాజ్ పేయ్ పెద్ద నటుడే కావొచ్చు కానీ.. అతగాడు సభ్యత లేని వ్యక్తిగా అభివర్ణించాడు. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు తీసుకునన పెద్ద మనిషి ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో నటించటాన్ని తప్పు పట్టారు.

'అలాంటి సభ్యత లేని వ్యక్తిని.. నీచుడ్ని నేనింతవరకుచూడలేదు. అతడు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాడు? ఆ వెబ్ సిరీస్ లో భార్యకు వివాహేతర సంబంధం.. భర్తకు మరో మహిళతో ఎఫైర్.. మైనర్ బాలికకు బాయ్ ఫ్రెండ్.. చిన్న పిల్లాడు తన వయసుకు మించి వ్యవహరించటం.. ఇలానే ఉంటుందా ఒక కుటుంబం? అంటూ నిలదీశాడు.ఇవేనా మీరుచూపించేది అంటూ ఉతికేశాడు. పెద్ద ఎత్తున పాపులర్ అయిన ఫ్యామిలీ మ్యాన్ లో ఉన్న బూతును చెప్పటం ద్వారా దర్శకులు ఏం ఆశించారు? అంటూ ప్రశ్నల్ని నిపుల మాదిరి సందించారు. మరి దీనిపై వెబ్ సిరీస్ దర్శకనిర్మాతలు కానీ లీడ్ రోల్ ప్లేస్ చేసిన మనోజ్ బాజ్ పేయ్ ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.