Begin typing your search above and press return to search.

కథ మార్చడం వలనేనా??

By:  Tupaki Desk   |   22 Sept 2017 7:00 AM IST
కథ మార్చడం వలనేనా??
X
కెరీర్ మొదట్లో కమెడియన్ గా ఎదిగి మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్ ఆ తర్వాత హీరోగా మారిన సంగతి తెలిసిందే. కానీ సునీల్ ని ప్రేక్షకులు కమెడియన్ గా ఇష్టపడినంతగా అతని హీరోయిజాన్ని ఇష్టపడలేదు. ఇప్పటివరకు సునీల్ హీరోగా వచ్చిన సినిమాల్లో రెండు మూడు సినిమాలు తప్పితే మిగతవాన్ని అపజయాన్నే అందుకున్నాయి. అయితే కెరీర్ లో సునీల్ హీరోగా ఎన్నడు అందుకొని మరో పెద్ద డిజాస్టర్ ని అందుకున్నాడు.

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తీసిన "ఉంగరాల రాంబాబు" సినిమా ఏ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కథలో ఏ మాత్రం కొత్తదనం లేకపోవడంతో నిర్మాతలకి తీరని నష్టాలని మిగిల్చింది. అయితే ఈ సినిమా ఫెయిల్ అవ్వడానికి కారణం సునీల్ అని కామెంట్స్ వినబడుతున్నాయి. మొదట క్రాంతి మాధవ్ రాసుకున్న కథను ఒకే చెప్పిన సునీల్ సెట్స్ పైకి వెళ్లగానే సినిమాలో సీన్స్ ని కథని చాలా చేంజ్ చేశాడట. అంతకు ముందు ఓనమాలు - మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలు తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ ఉంగరాల రాంబాబు స్క్రిప్ట్ లో మాత్రం కాస్త తడబడ్డాడు.

అసలు ఈ సినిమా తీసింది క్రాంతి మాదవేనా అని చాలామంది ప్రముఖులు అనుకుంటున్నారట. సినిమాలో ఒక్క ఎపిసోడ్ కూడా మెప్పించలేకుండా తీయడం చూస్తుంటే..సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎదో తప్పు జరిగిందని అందుకే సినిమా షూటింగ్ కూడా చాలా లేట్ గా జరిగిందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ సునీల్ మాత్రం సినిమా బాగా వచ్చిందని బాగా ఆదరిస్తున్నారు అని కూడా అంటున్నాడు. ఇక ఈ సినిమా ద్వారా సునీల్ తన నిర్ణయం మార్చుకున్నాడు. ఇక నుంచి ప్రేక్షకులకు కమెడియన్ గా కూడా ఇతర సినిమాల్లో కనిపించి దగ్గరవ్వాలని డిసైడ్ అయ్యాడు. మరి సునీల్ ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.