Begin typing your search above and press return to search.

ఉంగరాల రాంబాబుగా కామెడీ హీరో

By:  Tupaki Desk   |   2 July 2016 4:18 AM GMT
ఉంగరాల రాంబాబుగా కామెడీ హీరో
X
కమెడియన్ నుంచి హీరోగా మారిపోయిన సునీల్.. ఇప్పుడు కెరీర్ లో ఇబ్బందులు పడుతున్నాడు. హీరోగా మారిన మొదట్లో వరుస హిట్స్ సాధించిన ఈ కమెడియన్.. తర్వాత మాత్రం కెరీర్ గాడి తప్పింది. వరుస పరాజయాలతో డీలా పడ్డ సునీల్.. ఇప్పుడు రాబోతోన్న జక్కన్న పైన చాలానే ఆశలు పెట్టుకున్నాడు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి.. మెగాస్టార్ చిరంజీవిని పిలిచి హైప్ తీసుకొచ్చే ప్రయత్నం గట్టిగానే చేశాడు.

జక్కన్న ఇంకా రిలీజ్ కాకుండానే తన మరుసటి ప్రాజెక్టును ఫైనల్ చేశాడు సునీల్. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీని ఉంగరాల రాంబాబు అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. కామెడీ ఎంటర్టెయినర్ గా ఈ సినిమా తెరకెక్కనుడంగా.. పూర్తిగా పల్లెటూరిలో సాగే రొమాంటిక్ మూవీగా తీయనున్నారు. ఈ మూవీ కోసం సునీల్ కొత్త లుక్ లో కనిపించేందుకు ప్రయత్నించనున్నట్లు చెబుతున్నారు. గెటప్ విషయంలోను బాడీ లాంగ్వేజ్ లోనూ ఈసారి ఈ కామెడీ హీరోని కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారట.

ఇప్పటికే ఈడు గోల్డ్ ఎహె అనే సినిమాని పూర్తి చేసిన తర్వాత.. ఉంగరాల రాంబాబు షూటింగ్ ని మొదలుపెట్టనున్నాడు. ఈమధ్యన గోపీ మోహన్ - తనికెళ్ల భరణి కూడా సునీల్ తో సినిమా చేయాలని భావించి.. తర్వాత ప్రాజెక్టులు డ్రాప్ చేసుకున్నారు. ఈ మూవీని మాత్రం ఇప్పటికే అనౌన్స్ చేయడంతో.. ఉంగరాల రాంబాబు సెట్స్ పైకి వెళ్లడం ఖాయం అంటున్నారు. అయితే.. చెప్పినట్లుగా డైలాగ్ డెలివరీతో పాటు గెటప్ లోనూ సునీల్ కొత్తదనం చూపించకపోతే మాత్రం.. ఆడియన్స్ రియాక్షన్ లో మార్పు ఉండకపోవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.