Begin typing your search above and press return to search.

మహేష్-సందీప్.. నిర్మాత ఎవరు?

By:  Tupaki Desk   |   12 Sep 2018 6:58 AM GMT
మహేష్-సందీప్.. నిర్మాత ఎవరు?
X
బడా స్టార్లతో సినిమా చేయాలంటే అపారమైన అనుభవం.. ఎక్కువ సంఖ్యలో హిట్లు ఇచ్చిన రికార్డేమీ అవసరం లేదు. సరైన సినిమా ఒక్కటి తీసినా చాలు.. ఇప్పుడు పెద్ద హీరోలు పిలిచి అవకాశాలిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ కోవలోనే యువ దర్శకులకు అవకాశాలిచ్చాడు. శ్రీకాంత్ అడ్డాల.. కొరటాల శివల తొలి సినిమాలకు ఇంప్రెస్ అయి వాళ్లతో సినిమాలు చేశాడు. ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగకు కూడా అతను అవకాశం ఇస్తున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ చూసి ఫిదా అయిపోయి కొన్ని రోజుల్లోనే సందీప్‌ ను కలిశాడు మహేష్. ఆ సందర్భంగా వాళ్లిద్దరి మధ్య ఒక సినిమాకు ఒప్పందం కుదిరింది కూడా. ఐతే మధ్యలో ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ మీదికి సందీప్ వెళ్లిపోవడంతో ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. వచ్చే ఏడాది ఆ చిత్రం నుంచి బయటికి వచ్చాక మహేష్‌ తో సందీప్ పని చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ చిత్రానికి నిర్మాత ఎవరనే విషయంలో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలని చూస్తున్న అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఈ ప్రాజెక్టను టేకప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ మహేష్‌తో ఆల్రెడీ కమిట్మెంట్ తీసుకున్న ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్.. ఈ సినిమాను తనే నిర్మించాలని చూస్తున్నాడు. మహేష్ బాబు.. సునీల్ కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి దిగడం విశేషం. ఆ స్నేహంతోనే మహేష్ బాబు నుంచి ఒక సినిమాకు కమిట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సందీప్ తొలి సినిమా ‘అర్జున్ రెడ్డి’ని హోల్‌ సేల్‌ గా కొని పెద్ద ఎత్తున రిలీజ్ చేయడం ద్వారా అతడితోనూ మంచి సంబంధాలే ఉన్నాయి సునీల్ కు. అతడి నుంచి కూడా కమిట్మెంట్ తీసుకున్న సునీల్.. మహేష్-సందీప్ సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని భావిస్తున్నారు.