Begin typing your search above and press return to search.

లుక్ లాంచ్: పుష్ప‌రాజ్ కి అయినా చెమ‌ట‌లు ప‌ట్టాలి!

By:  Tupaki Desk   |   7 Nov 2021 11:02 AM IST
లుక్ లాంచ్: పుష్ప‌రాజ్ కి అయినా చెమ‌ట‌లు ప‌ట్టాలి!
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్ గా విల‌క్ష‌ణ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మ‌ల‌యాళ స్టార్ హీరో ఫ‌హ‌ద్ ఫాజిల్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇదే చిత్రంలో సునీల్ పాత్ర స‌ర్ ప్రైజింగ్ గా ఉంటుంద‌ని చాలా కాలంగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ముందే ప్ర‌చారం సాగిన‌ట్టుగానే.. సునీల్ లుక్ నిజంగానే షాకిస్తోంది. ఇందులో అత‌డు మంగ‌ళం శ్రీ‌ను అనే పాత్ర‌లో న‌టిస్తున్నారు. అత‌డి ఆహార్యాన్ని బ‌ట్టి క్రూరత్వం నిండిన‌ పెద్ద‌మ‌నిషిగా క‌నిపిస్తాడ‌ని అర్థ‌మ‌వుతోంది. సునీల్ లుక్ ఆద్యంతం డార్క్ షేడ్ తో విల‌న్ ని త‌ల‌పిస్తోంది.

ఆ తీక్ష‌ణ‌మైన చూపులు.. గాజు క‌ళ్ల‌లో క్రోధం.. డార్క్ గోల్డ్ షేడ్ ఖ‌ద్ద‌రు చొక్కాయ్.. చేతికి హెచ్.ఎం.టీ వాచీ..మెడ నిండా గోల్డ్ సిల్వ‌ర్ చైన్ లు బ్రాస్ లెట్లు.. చేతి వేలికి దొడ్డు ఉంగరాలు.. చంద‌నం-టేకు దుంగ‌ల‌తో చేసిన డార్క్ సింహాస‌నం పై కాలిని మ‌డ‌తేసి కూచున్న వైనం చూస్తుంటే అతడి పాత్ర తీరుతెన్నులు ఏ రేంజులో ఉండ‌నున్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. సునీల్ ఎంతో కాలంగా వేచి చూస్తున్న బ్రేక్ పుష్ప చిత్రంతో అందుకోవ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఇక త‌న స్నేహితుడు త్రివిక్ర‌మ్ ఇవ్వ‌లేని బిగ్ బ్రేక్ ని సుకుమార్ ఇస్తున్నాడ‌నే భ‌రోసా ఆ పోస్ట‌ర్ లో క‌నిపిస్తోంది. సునీల్ మునుపెన్న‌డూ క‌నిపించ‌నంత‌గా నెవ్వ‌ర్ బిఫోర్! అన్న తీరుగా క‌నిపిస్తున్నాడు. సునీల్ భ‌య్యా శోభ‌న్ బాబు రింగు కూడా సూప‌ర్భ్! అంటూ ఫ్యాన్స్ థియేట‌ర్ల‌లో విజిల్స్ వేయ‌డం ఖాయం. మంగ‌ళం శ్రీ‌నుగా అత‌డు ఏ మేర‌కు దుమ్ము రేపుతాడో తెర‌పై చూడాల్సిందే. దానికోసం డిసెంబ‌ర్ 17 థియేట్రిక‌ల్ రిలీజ్ వ‌ర‌కూ వేచి చూడాల్సి ఉంటుంది. పుష్ప చిత్రాన్ని తెలుగు-త‌మిళం-హిందీ స‌హా అన్ని భాష‌ల్లో పాన్ ఇండియా రేంజులో విడుదల చేయ‌నున్నారు. ఇప్ప‌టికే పుష్ప‌రాజ్ లుక్ కి ర‌ష్మిక మంద‌న లుక్ కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. ఫ‌హ‌ద్ ఫాజిల్ ఇంట్రో లుక్ కి కూడా స్పంద‌న అద్భుతంగా వ‌చ్చింది. ఇప్పుడు సునీల్ లుక్ నెటిజ‌నుల్లో దుమారం రేపుతోంది. ఈ లుక్ చూడ‌గానే పుష్ప‌రాజ్ కే చెమ‌ట‌లు ప‌ట్టించేట్టున్నాడుగా! అంటూ యూత్ కామెంట్ల‌తో చెల‌రేగుతున్నారు.