Begin typing your search above and press return to search.

సునీల్‌ కూడా పండగ చేసేసుకుంటాడా?

By:  Tupaki Desk   |   13 April 2015 7:30 PM GMT
సునీల్‌ కూడా పండగ చేసేసుకుంటాడా?
X
ప్రస్తుతం 'జోష్‌' సినిమా ఫేం వాసు వర్మ డైరక్షన్‌లో సిక్స్‌ ప్యాక్‌ సునీల్‌ ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నిక్కీ గల్రానీ, డింపుల్‌ చోప్డే హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. పోతే ఈ సినిమాను ప్రొడ్యూస్‌ చేస్తోంది మన దిల్‌ రాజుగారేనని వేరే చెప్పక్కర్లేదు. ఇక పాయింట్‌కు వద్దాం..

అప్పట్లో చాలా టైటిల్స్‌ కన్సిడర్‌ చేసి.. చివరకు ఈ సినిమాకు ''కృష్ణాష్టమి'' అనే టైటిల్‌ పెడదాం అంటూ రాజు గారు కన్‌ఫామ్‌ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఇదొక యాక్షన్‌ కామెడీ లవ్‌ స్టోరీ అని టాక్‌. ముందుగా ఈ కథను బన్నీకి వినిపించగా, మనోడు రిజక్ట్‌ చేశాడట. అయితే సునీల్‌ కనుక ఈ సినిమాను పూర్తిగా లవర్‌బాయ్‌లా చేస్తే ఆడియన్స్‌ దీన్ని పెద్దగా చూసే ఛాన్సుండదనేమో, ఇప్పుడు దీనిని ఒక కామెడీ మూవీగా మార్చేశారు. ఈ కామెడీ సినిమాకు పండుగ పేరు కలిసిచ్చేలా ''కృష్ణాష్టమి'' అంటే ఇదేదో ఫ్యామిలీ టైటిల్‌ అనుకుని రెగ్యులర్‌ ఆడియన్స్‌ ధియేటర్స్‌కు పరిగెత్తేసే ఛాన్సుందని, ఇలా సెలవిచ్చారా మరి?

ప్రస్తుతానికైతే ఈ సినిమాను ఫారిన్‌లో షూట్‌ చేస్తున్నారు. ఈలోపు రాజుగారు ''కేరింత'' సినిమా రిలీజ్‌ పనులు చూసుకుంటారట. ఆల్రెడీ ''ఓకె బంగారం''ను లైన్‌లో పెట్టాశారు కాబట్టి, ఇప్పుడు సొంత రిలీజ్‌లు చూసుకోవాల్సిందే. అది సంగతి.