Begin typing your search above and press return to search.

ఓటీటీ కోసం 'దేవుడు' అవతారం ఎత్తిన కమెడియన్‌

By:  Tupaki Desk   |   9 Oct 2021 1:00 PM IST
ఓటీటీ కోసం దేవుడు అవతారం ఎత్తిన కమెడియన్‌
X
స్టార్‌ హీరోల నుండి చిన్న హీరోల వరకు ఈమద్య కాలంలో అంతా కూడా ఓటీటీ పాట పాడుతున్నారు. పెద్ద ఎత్తున ఓటీటీ గురించిన చర్చ జరుగుతున్న నేపథ్యంలో అందులోని కంటెంట్‌ లో నటించేందుకు అంతా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లో ఆఫర్లు ఫుల్‌ గా ఉన్న వారు.. ఆఫర్లు అస్సలు లేని వారు అంతా కూడా ఓటీటీ కంటెంట్ లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఓటీటీ పై ఆసక్తి చూపించే వారు చాలా మంది ఉన్నారు. తాజాగా కమెడియన్ సునీల్‌ కూడా ఓటీటీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటికే ఆయన నటించిన సినిమాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక ఇప్పుడు 'హెడ్స్ అండ్ టైల్స్' తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. జీ5 ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న ఈ వెబ్‌ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ ను రెజీనా రిలీజ్ చేసింది.

పోస్టర్ లో సునీల్‌ లుక్ చాలా కూల్ గా ఒక స్వామీజీగా కనిపిస్తుంది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వెబ్‌ సిరీస్ లో ఆయన స్వామిజీగా కనిపించినా దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడట. దేవుడిగా సునీల్‌ నటన ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఇండస్ట్రీ వర్గాల వారు ఉన్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న సునీల్‌ పాత్ర మరియు ఈ వెబ్‌ సిరీస్ ను జీ5 లో అక్టోబర్‌ 22 నుండి స్ట్రీమింగ్‌ చేయవచ్చు. సునీల్‌ ప్రథాన పాత్రలో కనిపించబోతున్న ఈ వెబ్‌ సిరీస్‌ కథ మొత్తం ముగ్గురు అమ్మాయిల చుట్టు తిరుగుతుందని అంటున్నారు. ముగ్గురు అమ్మాయిలకు దేవుడిగా సునీల్‌ చేసే హెల్ప్‌ ఏంటీ అసలు సునీల్‌ దేవుడు అయ్యి ఉండి ఆ అమ్మాయిలకు ఎందుకు హెల్ప్‌ చేస్తాడు అనే విషయాలను తెలుసుకోవాలంటే వెబ్‌ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే వరకు వెయిట్‌ చేయాల్సిందే.

హీరోగా సునీల్‌ చాలా సినిమాలను చేసి సక్సెస్ అయ్యాడు. కొన్ని ప్లాప్‌ లు పడటంతో మళ్లీ కమెడియన్‌ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. కమెడియన్‌ గా రీ ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఆఫర్లు ర ఆక దిక్కులు చూశాడు. ఎట్టకేలకు ఆఫర్లు రావడంతో మళ్లీ బిజీ అయ్యాడు. ఈ సమయంలో సునీల్‌ కమెడియన్ గా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. సినిమాల్లో ఇంత బిజీగా ఉన్న సునీల్‌ ఈ వెబ్‌ సిరీస్ లో నటించేందుకు ఓకే చెప్పడం చూస్తుంటే ఆయనకు కథ మరియు ఆ దేవుడి పాత్ర బాగా నచ్చినట్లుగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సునీల్‌ హీరోగా రూపొందుతున్న సినిమా ఒకటి వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.