Begin typing your search above and press return to search.

గేర్ మార్చిన సునీల్ స్పీడు పెంచాడు..

By:  Tupaki Desk   |   7 July 2018 4:29 PM IST
గేర్ మార్చిన సునీల్ స్పీడు పెంచాడు..
X
కమెడియన్ నుంచి హీరోగా ఎదిగిన వారు ఎందరో సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ మన సునీల్ కు మాత్రం కాలం కలిసిరాలేదు.. మర్యాద రామన్న లాంటి గ్రాండ్ హిట్ కొట్టాక వరుస ఫ్లాపులు ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైన హిట్ దక్కలేదు. సోలో హీరోగా కంటిన్యూ అవ్వడం కష్టమని తేలిపోవడంతో తిరిగి కమెడియన్ గా మారిపోయాడు..

సునీల్ కమెడియన్ గా చేసేందుకు సై అనడంతో ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. తాజాగా నేను శైలజా ఫేమ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల తను తీయబోయే కొత్త సినిమాలో సునీల్ కోసం ఓ ఇంపార్టెంట్ రోల్ ను డిజైన్ ను చేశాడట.. ఈ పాత్ర గురించి చెప్పగానే సునీల్ వెంటనే ఒప్పుకున్నాడు. చిత్రలహరి బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో వస్తున్న ఈ మూవీలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో తేజూ ఫ్రెండ్ గా సునీల్ కనిపించబోతున్నాడు.

కథలో కీలకమైన పాత్ర కావడంతోనే సునీల్ సంతోషంగా ఓకే చెప్పాడని తెలిసింది. ఇందులో కళ్యాణి ప్రియదర్శన్-రితికా సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే సునీల్.. రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న అమర్ అక్బర్ అంటోని సినిమాలో కమెడియన్ పాత్ర పోషిస్తున్నారు. ఇక శర్వానంద్ సినిమాలోనూ కీలకమైన పాత్ర చేస్తున్నాడు. ఇలా కమెడియన్ గా సై అనడంతో సునీల్ కు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.