Begin typing your search above and press return to search.

మహేష్‌ సినిమాలో సునీల్‌ గెస్ట్‌ రోల్‌??

By:  Tupaki Desk   |   8 Sept 2015 12:07 PM IST
మహేష్‌ సినిమాలో సునీల్‌ గెస్ట్‌ రోల్‌??
X
మహేష్ బాబు సినిమాలో సునీల్ నటించబోతున్నాడని టాలీవుడ్ టాక్. కమెడియన్ నుంచి హీరోగా టర్న్ అయ్యాక... కొంతకాలం బాగానే ఉన్నా.. ఇప్పుడు సునీల్ స్లంప్ లో ఉన్నాడు. రీసెంట్ సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. ఓ టైంలో 15కోట్ల హీరో అనిపించుకున్నా.. ఇప్పుడు బాగా వెనకబడ్డాడు.

రిలీజ్ కి ముందు బాగా హైప్ రావడం, తీరా విడుదలయ్యాక ఫ్లాప్ కావడం కామన్ అయిపోయింది. ఇప్పుడు రాబోతున్న కృష్ణాష్టమికి అంచనాలు బాగున్నా.. రిజల్ట్ పై గ్యారంటీలు లేవు. ఇలాంటి టైంలో సునీల్ కి బంపర్ ఆఫర్ ఇఛ్చాడు మహేష్ బాబు. మూవీకి కీలకమైన ఓ సీరియస్ రోల్ లో సునీల్ చేయమని చెప్పాడట. ఇప్పటికే సునీల్ కూడా ఓకే చెప్పేశాడని తెలుస్తోంది. మామూలుగానే మల్టీస్టారర్ లకి మహేష్ ముందుంటాడు. అలాగని సునీల్ తో చేస్తే మల్టీస్టారర్ కాదులెండి.. కాకపోతే... తన సినిమాలో ఇంకో హీరోకి ఛాన్స్ ఇచ్చి ప్రోత్సహించడమంటే.. గొప్ప విషయమే.

అందులోనూ ఇప్పుడు ఫ్లాప్ లలో ఉన్న సునీల్ కి ఇవ్వడమంటే... పొగడాల్సిన విషయమే. కమెడియన్ నుంచి హీరోగా టర్న్ అయ్యాడు సునీల్. అది కూడా కామెడీ గీమెడీ కాదు... కమర్షియల్ హీరోగానే కెరీర్ మార్చుకున్నాడు. ఇప్పుడు మహేష్ సినిమాలో కేరక్టర్ కనుక క్లిక్ అయితే... సునీల్ కెరీర్ మరో టర్న్ తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.