Begin typing your search above and press return to search.
ఎఫ్3 లో ఛాన్స్ దక్కించుకున్నాడు
By: Tupaki Desk | 11 Oct 2020 6:00 PM ISTగత ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనీల్ రావిపూడి ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో వచ్చారు. వచ్చే ఏడాది ఎఫ్ 3 తో రావాలనుకున్నా కరోనా ఆయన ప్లాన్ ను ఖునీ చేసింది. ఎఫ్ 3 సినిమా కు లాక్ డౌన్ అడ్డుగా నిలిచింది. ఎఫ్ 3 స్ర్కిప్ట్ రెడీ చేసిన దర్శకుడు ఇప్పటికే వెంకీ మరియు వరుణ్ లతో ఓకే చెప్పించాడట. ఇక హీరోయిన్స్ గా తమన్నా మరియు మెహ్రీన్ లు మళ్లీ కంటిన్యూ అవ్వబోతున్నారు. ఈసారి మరో హీరో వీరికి జత కలిసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. రవితేజతో చర్చలు కూడా జరిగాయంటూ పుకార్లు షికార్లు చేశాయి. కాని కథ మళ్లీ ఇద్దరు హీరోలతో మాత్రమే ఉంటుందని దర్శకుడు అనీల్ రావిపూడి అన్నాడు.
తాజాగా ఈ సినిమా గురించి మరో కీలక అప్ డేట్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ సినిమాలో సునీల్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఎఫ్ 2 లో రాజేంద్ర ప్రసాద్ పోషించినటువంటి ఒక మంచి కామెడీ రోల్ ను సునీల్ తో చేయించాలని దర్శకుడు అనీల్ రావిపూడి భావించాడట. ఆ పాత్ర కమెడియన్ కు ఎక్కువ హీరోకు తక్కువ అన్నట్లుగా ఉంటుందట. ఈమద్య కాలంలో సునీల్ కు తన ప్రతిభ చూపించేందుకు సరైన ఛాన్స్ దక్కడం లేదు. కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరు అయిన అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 లో నటిస్తే సునీల్ మళ్లీ బిజీ అవ్వడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ ఏడాది చివరి నుండి ఎఫ్ 3 సినిమా షూటింగ్ షురూ అయ్యే అవకాశం ఉందట.