Begin typing your search above and press return to search.
సునీల్ ను వాళ్లు గుర్తించారండోయ్
By: Tupaki Desk | 6 Aug 2016 2:47 PM ISTమాస్ ఆడియన్స్ లో ఫాలోయింగ్ ఉందని.. బి-సి సెంటర్లలో ఓపెనింగ్స్ బాగా వస్తున్నాయని వరుసగా రొటీన్ మాస్ మసాలా సినిమాలే చేస్తున్నాడు సునీల్. దీని వల్ల సగటు ప్రేక్షకుడిలో తన మీద వ్యతిరేకత పెరిగిపోతుందనే విషయాన్ని అతను గుర్తించట్లేదు. ఎ సెంటర్లలో.. మల్టీప్లెక్సుల్లో అతడి సినిమాల పట్ల రాను రానూ ఆసక్తి బాగా తగ్గిపోతోంది. ఇక ఓవర్సీస్ లో అయితే సునీల్ సినిమాల్ని పట్టించుకోవడమే మానేశారు. ‘జక్కన్న’ సినిమా అయితే అక్కడ జీరో అయిపోయింది. ఈ సినిమాను రిలీజ్ చేయడానికి కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. ‘జక్కన్న’ రిజల్ట్ చూశాక మంచి పనే చేశాం అనుకున్నారు బయ్యర్లు. ఐతే ఆశ్చర్యకరంగా సునీల్ తర్వాతి సినిమా మీద మాత్రం ఓవర్సీస్ బయ్యర్లు ఆసక్తి చూపించారు.
వీరూ పోట్ల దర్శకత్వంలో సునీల్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘ఈడు గోల్డ్ ఎహే’ సెప్టెంబరు 9న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఓ ఓవర్సీస్ బయ్యర్ రూ.40 లక్షలకు తీసుకోవడం.. అమెరికాలో పెద్ద స్థాయిలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతుండటం విశేషం. ‘జక్కన్న’ను విడుదల చేస్తే రిలీజ్ ఖర్చులు దండగ అనుకున్నవాళ్లు.. ‘ఈడు గోల్డో ఎహే’ హక్కుల కోసం పోటీ పడటం.. రూ.40 లక్షలకు సినిమాను కొనడం అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇదంతా వీరూ పోట్ల ఘనతే అని చెప్పాలి. అతను ఇంతకుముందు తీసిన బిందాస్.. రగడ.. దూసుకెళ్తా విజయవంతమయ్యాయి. చివరి రెండు సినిమాలూ అమెరికాలో బాగానే ఆడాయి. అందుకే అతడి మీద భరోసాతో సునీల్ హీరో అయినా ‘ఈడు గోల్డ్ ఎహే’ను కొన్నారు. మరి వాళ్ల నమ్మకం ఏమాత్రం నిలబడుతుందో చూడాలి.