Begin typing your search above and press return to search.

సునీల్ సినిమాకి కూడా అదే సర్టిఫికేట్

By:  Tupaki Desk   |   28 Sept 2016 6:47 PM IST
సునీల్ సినిమాకి కూడా అదే సర్టిఫికేట్
X
సాధారణంగా సినిమా రిలీజ్ అనుకున్న డేట్ 2-3 రోజుల ముందు వరకు సెన్సార్ చేయించే అలవాటు మనవాళ్లకు లేదు. కానీ ఓవర్సీస్ లో వసూళ్లు పెరిగిన పుణ్యమా అని.. ఓ వారం ముందే అన్నీ రెడీ చేసేసుకుని.. బాక్సులు పంపిస్తున్నారు. దసరా పండక్కి రిలీజ్ షెడ్యూల్ చేసిన సినిమాలు అన్నీ ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసేసుకోవడం మంచి విషయమే కానీ.. అన్నిటికీ ఒకే సర్టిఫికేట్ రావడం మాత్రం ఆశ్చర్యకరం.

కమెడియన్ హీరో అయిన సునీల్ నటించిన మూవీ.. ఈడు గోల్డ్ ఎహెకి సెన్సార్ చేయించేశారు. వీరు పోట్ల డైరెక్షన్ లో ఏకే ఎంటర్టెయిన్మెంట్స్ బ్యానర్ లో ఈ మూవీ రూపొందగా.. అక్టోబర్ 7న విడుదల చేయబోతున్నారు. ఇప్పుడీ చిత్రానికి యు/ఏ సర్టిఫికేట్ ను ఇస్తూ.. సెన్సార్ సర్టిఫై చేసింది. అదే అసలలు ఆశ్చర్యకరమైన విషయం. సునీల్ లాంటి కామెడీ హీరో మూవీకి యూ/ఏ ఎందుకు అనిపించక మానదు.

ఈ దసరా లెక్కలన్నీ ఇలాగే ఉన్నాయి. ప్రేమమ్ అంటూ నాగ చైతన్య రొమాంటిక్ మూవీ చేస్తే.. దానికి కూడా యూ/ఏ సర్టిఫికేట్ నే ఇచ్చారు. మనుఊరి రామాయణం అంటూ ప్రకాష్ రాజ్ సినిమా చేస్తుంటే.. దానికి కూడా సేమ్ సర్టిఫికేట్ వచ్చింది. ఇప్పుడు సునీల్ సినిమాకి కూడా అదే సర్టిఫికేట్ అంటే.. ప్యూర్ గా పిల్లలు చూడగలిగే సినిమాలు తీసేందుకు మనోళ్లు పెద్దగా ఇష్టపడ్డం లేదన్న మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/