Begin typing your search above and press return to search.

నాలుగు ఊళ్ళలో గోల్డ్ పాటలు ఏహా

By:  Tupaki Desk   |   16 Sept 2016 3:01 PM IST
నాలుగు ఊళ్ళలో గోల్డ్ పాటలు ఏహా
X
ఇప్పుడు సినిమా రిలీజ్ చేసేముందే ప్రమోషన్లు విస్తృతంగా చేయాలి. లేకపోతే సినిమాలు ధియేటర్లలో వర్కవుట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. విపరీమైన ప్రమోషనల్ హైప్ ఇచ్చిన తరువాత.. అప్పుడు కంటెంట్ బాగుంటే.. ఒక పెళ్ళి చూపులు, ఒక జనతా గ్యారేజ్ వంటి రేంజ్ కలక్షన్లను మనం చూడొచ్చు. అందుకే ఇప్పుడు అక్టోబర్ 7న టార్గెట్ చేస్తున్న గోల్డ్ బాబు కూడా పనిలోకి దిగేత్తున్నాడహో.

''ఈడు గోల్డ్ ఏహా'' అంటూ పక్కా ఊరమాస్ టైటిల్ తో దూసుకొస్తున్నాడు హీరో సునీల్. ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో ఇప్పుడు మాంచి ప్రమోషన్ ప్లాన్ ఒకటి డిజైన్ చేశారు. ఇప్పటివరకు రిలీజవ్వని ఈ సినిమా పాటలను రోజుకోటి చొప్పున ఒక్కొక్క ఊరిలో రిలీజ్ చేస్తారట. సెప్టెంబర్ 21 నుండి హైదరాబాద్ - వైజాగ్ - రాజమండ్రి - విజయవాడలలో ఒక్కొక్కపాటను ఒక్కో రోజు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తారట. ఆ విధంగా సినిమాకు మణిశర్మ అందించిన పాటలను రోజుకోటి రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో సినిమా మీద క్రేజ్ పెంచాలని గోల్డ్ బాబు ప్లానింగ్.

ఇప్పటికే హీరో సునీల్ సరసన హీరోయిన్లు సుష్మారాజ్ అండ్ రిచా పనయ్ లు భారీగా మాసు గ్లామర్ పండించడం సినిమాకు పెద్ద ఎసెట్ అయ్యింది. ఇప్పుడు సునీల్ పాటలతో ఆక్టుకుంటే ఇంకా ప్లస్ అవుతుంది. ఈ ఏడాది హ్యాట్రిక్ రిలీజుతోనైనా సునీల్ బడా హిట్ కొడతాడేమో చూడాలి.