Begin typing your search above and press return to search.
ముస్లిమ్ యువకుడిగా సునీల్ షాకింగ్ లుక్
By: Tupaki Desk | 29 Aug 2021 7:04 PM ISTసునీల్- ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం `బుజ్జి ఇలా రా`. `సైకలాజికల్ థ్రిల్లర్` అనేది ట్యాగ్ లైన్. ఉపశీర్షికను బట్టే సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. చాందిని అయ్యంగార్ హీరోయిన్ గా నటిస్తోంది. రూపా జగదీశ్ సమర్పణలో ఎస్.ఎన్.ఎస్ క్రియేషన్స్ ఎల్.ఎల్.పి- జీ నాగేశ్వరరెడ్డి టీమ్ వర్క్ పతాకాలపై అగ్రహారం నాగిరెడ్డి- సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ అలాగే ఇటీవల విడుదలైన సీఐ కేశవ్ నాయుడు పాత్రలో నటిస్తున్న ధన్‌రాజ్ పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా నిర్మాతలు ఈ సినిమాలోని సునీల్ పాత్రకు సంబంధించిన లుక్ ను విడుదల చేశారు. ధన్ రాజ్ ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నడుస్తుండగా.. సునీల్ మహమ్మద్ కయ్యుమ్ పాత్రలో నటిస్తున్నాడు. కయ్యూమ్ పాత్రలో సునీల్ గెటప్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. గరుడవేగ అంజి ఈ సినిమాకి దర్శకత్వం వహించడం తో పాటు సినిమాటోగ్రాఫర్ గానూ వర్క్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లేను అందిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి భాను- నందు డైలాగ్స్ అందిస్తున్నారు.
చాందిని తమిళరసన్ - పోసాని కృష్ణమురళి- శ్రీకాంత్ అయ్యర్- సత్యకృష్ణ- వేణు- భూపాల్- టెంపర్ వంశీ తదితరులు నటిస్తున్నారు. రూపా జగదీష్ సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి- సంజీవ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.