Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: కలర్ ఫోటో విలన్.. రామరాజు

By:  Tupaki Desk   |   28 Feb 2020 8:15 AM GMT
ఫస్ట్ లుక్: కలర్ ఫోటో విలన్.. రామరాజు
X
ఈరోజు ప్రముఖ టాలీవుడ్ నటుడు సునీల్ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సునీల్ కు ఫాన్స్ నుండి.. సన్నిహితుల నుండి శుభాకాంక్షలు.. బర్త్ డే మెసేజులు వెల్లువెత్తుతున్నాయి. ఇక సునీల్ నటించే సినిమాల మేకర్స్ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కమెడియన్ సుహాస్ హీరోగా నటిస్తున్న చిత్రం 'కలర్ ఫోటో'. ఈ సినిమాలో సునీల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ రోజు సునీల్ బర్త్ డే సందర్భంగా 'కలర్ ఫోటో' టీమ్ సునీల్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో సునీల్ పోషిస్తున్న పాత్ర పేరు రామరాజు అంటూ పోస్టర్ లో వెల్లడించారు. జీపు లో స్టైల్ గా కూర్చున్న సునీల్ ఒక ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు. సునీల్ ఈమధ్య రిలీజ్ అయిన 'డిస్కోరాజా' చిత్రంలో తొలిసారి నెగెటివ్ పాత్రలో కనిపించారు. ఇప్పుడు మరోసారి విలన్ రోల్ లో ఆడియన్స్ ను మెప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

ఈ సినిమాలో సుహాస్ సరసన చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కు కీరవాణి తనయుడు కాల భైరవ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు సందీప్ రాజ్. 'కలర్ ఫోటో' ను స్టీవెన్‌ శంకర్‌ లౌక్య ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు.