Begin typing your search above and press return to search.
కోలీవుడ్ లో విలన్ గా సునీల్!
By: Tupaki Desk | 31 May 2023 9:00 PMసునీల్ కెరీర్ మళ్లీ పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. వచ్చిన అవకాశాలు అందుకుంటూ గాడి తప్పిన బండిన మళ్లీ పట్టాలెక్కించి వేగం పెంచే పనిలో ఉన్నాడు. స్టార్ హీరోల చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూనే చిన్న సినిమాల్లో నూ నటిస్తున్నాడు. పాత్ర ఏదైనా? నో అనకుండా చేస్తున్నాడు. 'పుష్ప' సినిమా తో తన లో కొత్త యాంగిల్ ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
ప్రతి నాయకుడి పాత్ర లో ఆద్యంతం ఆకట్టుకు న్నాడు. విలన్ గానూ మెప్పించగలడని నిరూపించుకున్నాడు. ఆ సినిమా తో పాన్ ఇండియాలో గుర్తింపు దక్కింది. ఇప్పుడా క్రేజ్ తో నే కోలీవుడ్ లో సైతం విలన్ గా నటించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.
తెలుగు నటి అంజలి ప్రధాన పాత్రలో 'ఈగై' అనే సినిమా తెరకెక్కుతోంది. ఇదొక ఇన్వస్టిగేటివ్ థ్రిల్లర్ జానర్ సినిమా. తెలుగు..తమిళ్ లో ఈ చిత్రాన్ని అశోక్ వేలాయుధన్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రతినాయకుడి పాత్రకు తెలుగు నటుడు సునీల్ ని ఎంపిక చేసారు. తాను రాసుకున్న పాత్రకు సునీల్ అయితేనే న్యాయం చేస్తాడని భావించి ఆయన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తెలుగు మార్కెట్ పరంగానూ సునీల్ అయితే వర్కౌట్ అవుతుందన్న కోణం లోనూ అతని ఎంపిక కనిపిస్తుంది.
సీతమ్మ కి తోడుగా సునీల్ లాంటి బలమైన పాత్ర దొరికితే! ఇక్కడ మార్కెట్ పరంగా ఇబ్బంది ఉండదు. అదీ ఓ కారణం కావచ్చు. ఇక తమిళ్ లో అంజలి కి ఎలాగూమంచి గుర్తింపు ఉంది. కొన్నేళ్లగా అక్కడే సినిమాలు చేస్తుంది. తెలుగు నటి అయినా తమిళ్ లో స్థిరపడిన నటి. జూన్ 9 నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానుందిట. ముంబై ..చెన్నై..హైదరాబాద్ ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించనున్నట్లు సమాచారం.
ఇది సునీల్ కి మంచి అవకాశం. పుష్ప తర్వాత సునీల్ కి పెద్ద సినిమా పడలేదు. పెద్ద సినిమాల్లో నటించినా చిన్న పాత్రలు మాత్రమే. ఈ నేపథ్యంలో అంజలి సినిమా లో విలన్ రోల్ అంటే! మళ్లీ ఫేమస్ అవ్వడానికి అవకాశం ఉంది. పైగా కోలీవుడ్ దర్శకుడి సినిమా కాబట్టి పాత్రలో విషయం ఉంటుందని చెప్పొచ్చు. సక్సెస్ అయితే సునీల్ కటౌట్ కి తమిళ్ లో మంచి అవకాశాలు వస్తాయి. ఈ తరహా కటౌట్ లు అక్కడ ఫెయిలైంది లేదు. మంచి సక్సెస్ రేటుంది. తమిళ తంబీలు సునీల్ తరహా టైమింగ్ కి బాగా కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది.