Begin typing your search above and press return to search.

జిగిరీ దోస్తీలు లైన్‌లోకొస్తున్నారా?

By:  Tupaki Desk   |   25 Jun 2015 10:39 AM IST
జిగిరీ దోస్తీలు లైన్‌లోకొస్తున్నారా?
X
సునీల్‌, త్రివిక్రమ్‌ ఒకే రూమ్‌లో ఒకే టీలో రెండు బిస్కెట్‌ నంజుకుతిన్నారన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ అంత జిగిరీ దోస్తీలు. కెరీర్‌ ఎటెళ్తోందో అర్థం కాని రోజుల్లో బోలెడన్ని కలలుగనేవారు. వాటిని నిజం చేసుకోవడానికి లెక్కలు మాష్టారు అవతారం కూడా ఎత్తారు. చివరికి ప్రయత్నం ఫలించి త్రివిక్రమ్‌ బాపు దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టరయ్యాడు. ఆ తర్వాత రచయితగా పేరు తెచ్చుకున్నాడు. కాలక్రమంలో దర్శకుడయ్యాడు. ఆ క్రమంలోనే సునీల్‌ నటుడిగా బిజీ అయ్యాడు.

అయితే సునీల్‌ నటుడిగా బిజీ అవ్వడం వెనుక త్రివిక్రమ్‌ హస్తం ఉందని చెబుతుంటారు. అతడి రికమండేషన్‌తో బోలెడన్ని అవకాశాలు అందుకున్నాడు సునీల్‌. అయితే వీళ్లిద్దరూ ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదిగేశాక కలిసి పనిచేస్తారని అనుకున్నారంతా. కానీ ఎవరి దారిన వాళ్లు వెళ్లారు. సునీల్‌ ఇతర దర్శకులతో పనిచేశాడు కానీ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించనేలేదు ఇంతవరకూ. అయితే ఇప్పుడు అందుకు సందర్భం వచ్చింది. త్రివిక్రమ్‌ ఇంతవరకూ ఏ స్టార్‌ హీరోతోనూ పనిచేస్తున్నా అని ప్రకటించలేదు. అంటే తనకి కావాల్సినంత తీరిక సమయం చిక్కింది.

ఎలాగూ స్నేహితుడు సునీల్‌తో ఓ సినిమాకి పనిచేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు. సునీల్‌కి కూడా సరైన బ్రేక్‌ రావాల్సిన టైమ్‌ ఇది. కాబట్టి స్నేహితులిద్దరూ లైన్‌లోకొస్తేనే బెటర్‌ అని అనుకుంటున్నారంతా. అదే జరుగుతుందేమో చూడాలి.