Begin typing your search above and press return to search.

సందీప్.. ఆ సినిమా చేద్దానుకుంటున్నాడా?

By:  Tupaki Desk   |   19 March 2016 5:30 PM GMT
సందీప్.. ఆ సినిమా చేద్దానుకుంటున్నాడా?
X
నాగశౌర్యను చూస్తే బబ్లీగా అనిపిస్తాడు. లవర్ బాయ్ తరహా క్యారెక్టర్లయితే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అతను మాత్రం మాస్ హీరో అయిపోదామనుకున్నాడు. ‘జాదూగాడు’లో మాస్ చొక్కా తొడుక్కున్నాడు. అది సూటవ్వలేదు. జనాలు తీసి అవతల పడేశారు. పాత్రల్లో వైవిధ్యం చూపించాలనుకోవడం మంచిదే కానీ.. మరీ తమకు నప్పని క్యారెక్టర్లు చేస్తే ఫలితం అలాగే ఉంటుంది మరి. ఈ సంగతి గ్రహించకుండా మరో యువ కథానాయకుడు సందీప్ కిషన్ సైతం.. వీరావేశంతో ఓ పోలీస్ క్యారెక్టర్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు. తమిళంలో ఇటీవలే పెద్ద హిట్టయిన ‘సేతుపతి’ తెలుగు రీమేక్ లో తాను హీరోగా నటించాలని ఉబలాట పడుతున్నాడట సందీప్.

‘సేతుపతి’లో విజయ్ సేతుపతి హీరోగా నటించాడు. ఫెరోషియస్ పోలీస్ కథతో తెరకెక్కిన సినిమా ఇది. విజయ్ సేతుపతికి తమిళంలో కొంత వరకు మాస్ ఇమేజ్ ఉంది. ఆ పాత్రకు అతను బాగా సూటయ్యాడు. కానీ సందీప్ కిషన్ ఆవేశపరుడైన పోలీస్ పాత్రకు ఏమాత్రం సూటవుతాడన్నది సందేహం. అసలతడికి మాస్ ఇమేజే లేదు. ఇక వీరావేశం ఉన్న పోలీస్ పాత్ర ఏం చేస్తాడు? ఆల్రెడీ ‘డీకే బోస్’ అనే పోలీస్ సినిమా చేయబోయాడు కానీ.. అదే మధ్యలో ఆగిపోయింది. మరి ఇప్పుడు ‘సేతుపతి’ మీద ఎందుకు ఆశపడున్నాడో ఏంటో మరి. నిజానికి ‘సేతుపతి’ మీద ముందు విక్టరీ వెంకటేష్ కన్నేసినట్లు వార్తలొచ్చాయి. కానీ తర్వాత వెంకీ సైలెంట్ అయిపోయాడు. ఇది తెలుగులోకి రీమేక్ చేయదగ్గ కంటెంట్ ఉన్న సినిమానే కానీ.. మంచి మాస్ హీరో అయితేనే బాగుంటుంది. మరి ఈ రీమేక్ చివరికి ఎవరి దగ్గర ఆగుతుందో చూడాలి.