Begin typing your search above and press return to search.

సందీప్ కిషన్ మళ్ళీ ఆ దర్శకుడితో ప్రయత్నాలు

By:  Tupaki Desk   |   13 Feb 2023 6:08 PM IST
సందీప్ కిషన్ మళ్ళీ ఆ దర్శకుడితో ప్రయత్నాలు
X
టాలెంటెడ్ యాక్టర్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి సందీప్ కిషన్. ప్రస్థానం సినిమాతో కెరియర్ స్టార్ట్ చేసిన సందీప్ కిషన్ తరువాత స్నేహగీతం సినిమాతో హీరోగా మారాడు. తరువాత సోలో హీరోగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటు తెలుగు, అటు తమిళంలో హీరోగా సక్సెస్ కావడానికి వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే సందీప్ కిషన్ కెరియర్ లో చెప్పుకోదగ్గ హిట్స్ అంటే మాత్రం మహా అయితే మూడు నుంచి నాలుగు సినిమాలు మాత్రమే ఉంటాయి.

తెలుగులో కమర్షియల్ జోనర్ కథలు ఎక్కువగా చేసిన సందీప్ కి ఏవి కూడా ఆశించిన హిట్స్ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే తాజాగా పాన్ ఇండియా లెవల్ లో మైఖేల్ అనే సినిమాతో సందీప్ కిషన్ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. పీరియాడిక్ యాక్షన్ కథాంశంతో మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కడంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. సినిమాకి ప్రమోషన్ కూడా ఎక్కువగానే చేశాడు. అయితే రిలీజ్ తర్వాత ఊహించని రిజల్ట్ వచ్చింది.

ఫస్ట్ డే కూడా కనీసం స్ట్రాంగ్ ఓపెనింగ్స్ కూడా మూవీ రాబట్టలేకపోయింది. ఇక డిజాస్టర్ టాక్ ని తెచ్చుకుంది. ఇదిలా ఉంటే మైఖేల్ తో నిరాశ పరిచిన సందీప్ కిషన్ తన ప్రయత్నం మాత్రం ఆపడం లేదు.

ఈ సారి మరింత పకడ్బందీతో మంచి టాలెంటెడ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. తనని నటుడిగా పరిచయం చేసిన దేవాకట్టా దర్శకత్వంలోనే ఇప్పుడు హీరోగా సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. దేవకట్టా సినిమాలు అన్ని కూడా సోషల్ ఎక్స్ పర్మెంట్ కథలుగానే ఉంటాయి. చివరిగా అతను చేసిన సినిమా కొల్లేరు అక్రమాల నేపధ్యంలో రిపబ్లిక్ అనే మూవీ చేసి రాజకీయ పార్టీల తీరు ఎలా ఉంటుంది.

ప్రజలని వారు ఎలా మోసం చేస్తారు అనే అంశాలని తెరపై ఆవిష్కరించారు. సినిమా బాగుంది అనే టాక్ వచ్చిన కమర్షియల్ సక్సెస్ కాలేదు. ఈ నేపధ్యంలో ఇప్పుడు సందీప్ కిషన్, దేవా కట్టా కలిసి ప్రయోగం చేయడానికి రెడీ అవుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. తనకి అలవాటైన జోనర్ లోనే కాస్తా ఎమోషనల్ టచ్ ఇస్తూ సినిమాని తెరకెక్కించాలని దేవకట్టా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

ప్రస్తుతం సందీప్ కిషన్ ఊరుపేరు భైరవకొన అనే సినిమా చేశాడు. ఈ మూవీని త్వరలో రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. దీని తర్వాత దేవకట్టా సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.