Begin typing your search above and press return to search.

ఇది టూ మాచ్ సందీప్

By:  Tupaki Desk   |   22 Jan 2018 4:41 PM IST
ఇది టూ మాచ్ సందీప్
X
సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉంటే అవకాశాలకు కొదవ లేదు. కానీ ఎన్ని అవకాశాలు వచ్చినా ఎంతో కొంత హిట్స్ అందుకుంటేనే పాపులర్ అవ్వచ్చు. కానీ ఎవరు ఊహించని విధంగా ఒక కుర్ర హీరో మాత్రం రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటున్నాడు. అతను ఎవరో కాదు సందీప్ కిషన్. ప్రముఖ సీనియర్ కెమెరామెన్ చోటా కె నాయుడు మేనల్లుడైన సందీప్ మొదట తెలుగులో మంచి విజయాలను అందుకున్నాడు.

కానీ వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ తరువాత మళ్లీ డౌన్ అయ్యాడు. అయినా సరే సందీప్ కష్టపడుతూనే ఉన్నాడు. అయితే తమిళ్ లో వస్తోన్న సక్సెస్ రేట్ ఇక్కడ రావడం లేదు. ఇక అసలు విషయానికి వస్తే.. సందీప్ లేటెస్ట్ మూవీ మనసుకు నచ్చింది సినిమా త్వరలో రిలీజ్ కానుంది. మొదట సినిమాను జనవరి ఎండింగ్ లోనే రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఫిబ్రవరి 16కి షిఫ్ట్ చేశారు. అయితే సందీప్ మాత్రం సినిమా మీద నమ్మకంతో ముందుగానే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశాడు.

అది కూడా అమెరికా నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. సినిమాకు 20 రోజులు టైమ్ ఉంది. కానీ మనోడు ఈ రోజు వాషింగ్టన్ లో అలాగే 22న చికాగో 27న న్యూ జెర్సీ లో ప్రమోషన్స్ ని నిర్వహించడానికి ప్లాన్ చేసుకున్నాడు. దీంతో ఇది మరి టూ మచ్ అనేలా ఓ వర్గం వారు కామెంట్స్ చేస్తున్నారు. అమెరికాలో ప్రచారం నిర్వహిస్తే సినిమా రేంజ్ పెరుగుతుంది అనుకోవడం పొరపాటే అని మరికొందరు అంటున్నారు. మరి మనోడు ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.