Begin typing your search above and press return to search.

రన్ లో జోక్.. ఆ స్టార్ కి సెటైరా?

By:  Tupaki Desk   |   23 March 2016 11:30 AM GMT
రన్ లో జోక్.. ఆ స్టార్ కి సెటైరా?
X
ఏ రిలేషన్ బిట్వీన్ ఏ హజ్బెడ్ అండ్ వైఫ్ అంటూ.. భార్యాభర్తల మధ్య అనుబంధం చేప - నీరులా ఉండాలి కానీ.. చేప - జాలరి లా ఉండకూడదంటూ... పెదరాయడు మూవీలో పెద్ద మోహన్ బాబు ఓ సూపర్బ్ డైలాగ్ చెబ్తాడు. తెలుగు సినిమాల్లో చాలా రకాల పారడీలు వచ్చినా.. పెదరాయుడు మూవీతో స్పూఫ్ లు వేసినా.. ఈ డైలాగ్ ని మాత్రం ఎవరూ టచ్ చేయలేదు. ఇప్పుడా డైలాగ్ ను వాడేసుకుని ఓ స్టార్ హీరోకి పంచ్ వేసేశాడు రన్ సినిమాలో.

'ఏ రిలేషన్ బిట్వీన్ బావ అండ్ బామ్మర్ది లైక్ చంద్రబాబు అండ్ బాలయ్య బాలయ్య బాబు.. షుడ్ నాట్ బీ లైక్... ఎవరో చెప్పక్కర్లేదుగా' అంటూ డైలాగ్ పడుతుంది. తమ సినిమా కోసం కరెంట్ అఫైర్స్ న్యూస్ ని వాడేసుకోవడం కరెక్టే కావచ్చు కానీ.. ఇలా ఫ్యామిలీల మధ్య ఉన్న విబేధాలను బేస్ చేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదనే మాటలు వినిపిస్తున్నాయి. పైగా ఇప్పుడిలా కుటుంబ విబేధాలతో సతమతమవుతోంది.. జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే అనే విషయం ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు.

వీళ్ల జోకుల కోసం ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన పర్సనల్ సంగతులు బైటకు లాగుతారా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడిపోతున్నారు. మరోవైపు నందమూరి అభిమానుల నుంచి కూడా ఈ డైలాగ్ కు మద్దతు లభించడం లేదు. ఎవరో ఎవరినో కాపాడతారు అన్నట్లుగా అర్ధం వచ్చే డైలాగ్ కావడంతో.. నందమూరి అభిమానులను కూడా ఈ డైలాగ్ హర్ట్ చేసింది.