Begin typing your search above and press return to search.

ఈ ట్రైలర్ కామెడీగా ఉంది గురూ..

By:  Tupaki Desk   |   22 March 2016 3:30 PM GMT
ఈ ట్రైలర్ కామెడీగా ఉంది గురూ..
X
ఓ సినిమా తీస్తున్న దర్శకుడు, నిర్మాత అంతకుముందు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులేవైనా చేస్తే.. ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ అని.. ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ అని.. ట్యాగ్ లైన్స్ వేయడం మామూలే. ఐతే ఈ బుధవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘రన్’ టీమ్ మాత్రం కొంచెం వెరైటీ రూట్లో సాగింది. బెన్ హర్ - టైటానిక్ - ట్రాయ్ లాంటి హాలీవుడ్ సినిమాల బొమ్మలు చూపించి.. ఈ సినిమాలతో పాటు టొరంటినో సినిమాలన్నీ చూసి టీమ్ సభ్యుల నుంచి వస్తున్న సినిమా అంటూ వెరైటీగా ఓ ట్రైలర్ వదిలింది రిలీజ్‌ కు ముందు. ఇలాంటి హాలీవుడ్ సినిమాలు చూడ్డంలో ఉన్న గొప్పేంటన్నదే ఇక్కడ అర్థం కాని విషయం.

గొప్ప గొప్ప హాలీవుడ్ సినిమాలు చూసినంత మాత్రాన ఆ వ్యక్తుల నుంచి అద్భుతమైన సినిమా వచ్చేస్తుందన్న గ్యారెంటీ ఏమీ లేదు కదా. పైగా ‘రన్’ మూవీ తమిళ రీమేక్ కూడా. ఇలా వేరే భాష నుంచి తెచ్చిన సినిమాకు ఈ రకంగా ప్రచారం చేసుకోవడమేంటో. జనాల అటెన్షన్ కోసం ఏదో వెరైటీగా ట్రే చేద్దామని చూశారేమో. ఆ సంగతలా వదిలేస్తే సమ్మర్ సీజన్లో మొదటగా వస్తున్న ఈ సినిమా మీద జనాల్లో పాజిటివ్ బజ్ అయితే ఉంది. వెరైటీ ప్రమోషన్‌తో.. ఆసక్తికర టీజర్, ట్రైలర్లతో జనాల్లో బాగానే ఆసక్తి రేపింది ‘రన్’ టీమ్. ఇంతకుముందు అసాధ్యుడు, మిస్టర్ నూకయ్య సినిమాలు తీసిన అని కన్నెగంటి దర్శకుడు. సందీప్ కిషన్, అనీషా ఆంబ్రోస్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించాడు.