Begin typing your search above and press return to search.

'నెక్ట్స్‌ ఏంటీ'.. అప్‌ డేటెడ్‌ తెలుగు సినిమా!

By:  Tupaki Desk   |   20 Nov 2018 1:30 AM GMT
నెక్ట్స్‌ ఏంటీ.. అప్‌ డేటెడ్‌ తెలుగు సినిమా!
X
తెలుగు సినిమా రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి. టెక్నాలజీతో పాటు - మేకింగ్‌ విషయంలో - కథల కొత్తదనం విషయంలో - నటీనటుల విషయంలో అన్ని విషయాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. అయితే కొన్ని విషయాల్లో మాత్రం బాలీవుడ్‌ సినిమాల స్థాయికి వెళ్లేందుకు తెలుగు ఫిల్మ్‌ మేకర్స్‌ ఆసక్తి చూపడం లేదు. ఒకటి రెండు సినిమాల్లో బాలీవుడ్‌ సినిమాల్లో కనిపించే బోల్డ్‌ కంటెంట్‌ చూపించినా కూడా అవి సక్సెస్‌ కాలేదు. దాంతో తెలుగు సినిమాల్లో బాలీవుడ్‌ తరహా బోల్డ్‌ కంటెంట్‌ కు దూరంగా ఉంటున్నారు.

తాజాగా సందీప్‌ కిషన్‌ - తమన్నా జంటగా తెరకెక్కిన ‘నెక్ట్స్‌ ఏంటీ’ చిత్రం పూర్తిగా బాలీవుడ్‌ తరహా బోల్డ్‌ కంటెంట్‌ మూవీ అంటూ సమాచారం అందుతోంది. దర్శకుడు కునాల్‌ కోహ్లీ పూర్తిగా బాలీవుడ్‌ దర్శకుడు. దాంతో కునాల్‌ బాలీవుడ్‌ తరహా సినిమాను ఇక్కడ తెరకెక్కించాడు. ఇప్పటికే ఆ విషయం ట్రైలర్‌ లో చెప్పకనే చెప్పాడు. బోల్డ్‌ కంటెంట్‌ బొచ్చెడు ఉన్నట్లుగా ట్రైలర్‌ చూస్తుంటే అర్థం అవుతుంది. ట్రైలర్‌ తో యూత్‌ ఆడియన్స్‌ లో ఆసక్తి అయితే కలిగించారు. మరి సినిమా ఎలా ఉంటుందో అనేది చూడాలి.

తెలుగు లో బోల్డ్‌ కంటెంట్‌ తో సినిమా చేస్తే ఒక్క వర్గం వారికే ఆ సినిమా పరిమితం అవుతుందని చెప్పుకోవాలి. ఫ్యామిలీ ఆడియన్స్‌ తెలుగు బోల్డ్‌ కంటెంట్‌ సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపించరు. అయినా కూడా తెలుగు సినిమా పరిశ్రమను అప్‌ డేట్‌ చేయాలనే ఉద్దేశ్యంతో సందీప్‌ కిషన్‌, తమన్నా ఇలాంటి సినిమా చేశారట. మరి బోల్డ్‌ కంటెంట్‌ తో రాబోతున్న ఈ చిత్రం సక్సెస్‌ దక్కించుకుని, భవిష్యత్తులో బోల్డ్‌ కంటెంట్‌ చిత్రాల సంఖ్య పెరిగేలా చేస్తుందా చూడాలి.