Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టాక్: వాడు రౌడీ వాడి నాన్న రౌడీ వాడి తాత రౌడీ.. కానీ!

By:  Tupaki Desk   |   13 Sep 2021 4:19 AM GMT
ట్రైల‌ర్ టాక్: వాడు రౌడీ వాడి నాన్న రౌడీ వాడి తాత రౌడీ.. కానీ!
X
వాడు రౌడీ వాడి నాన్న రౌడీ వాడి తాత రౌడీ.. కానీ! వాడిని రౌడీ అంటే న‌మ్మ‌లేం. వేసే వేషాల‌న్నీ రౌడీ వేషాలే. వాడిని వీడిని చిత‌క త‌న్నుతున్న‌ట్టే న‌టిస్తున్నాడు కానీ .. ఎందుకు ఇవ‌న్నీ చేస్తున్నాడో అర్థం కాదు. ఇంత‌కీ కార‌ణం ఏమై ఉంటుంది? అంటే.. అదంతా ల‌వ్ .. ప్రేమించిన అమ్మాయిని గెలుచుకునేందుకు అత‌డు రౌడీగా మార‌తాడు. ఆ త‌ర్వాత పుట్టుకొచ్చిన థ్రిల్స్.. కాప్ ఛేజ్.. కిడ్నాప్ గ్యాంగ్ డ్రామా.. ఫ్యామిలీ సెంటిమెంట్ .. కామెడీ వ‌గైరా వ‌గైరా ఎలిమెంట్స్ తో `గ‌ల్లీ రౌడీ` ట్రైల‌ర్ ఆద్యంతం అల‌రిస్తోంది.

కొన్ని నిమిషాల ట్రైల‌ర్ లో సందీప్ కిషన్ రౌడీయిజంలో టింజ్ ఆక‌ట్టుకుంది. ఇక అమ్మాయి(నేహా శెట్టి)తో ల‌వ్ కోసం అత‌డి పాట్లు క‌నిపించాయి. సందీప్ ఫ్రెండ్స్ గ్యాంగ్ నుంచి కామెడీ ఎలిమెంట్స్ ని .. రాజేంద్ర ప్ర‌సాద్ అండ్ ఫ్యామిలీ నుంచి సెంటిమెంటు కిడ్నాప్ డ్రామాల్ని ఆశించ‌వ‌చ్చ‌ని ట్రైల‌ర్ చెబుతోంది. ఇక నేహా శెట్టి అందం న‌ట‌న ఆకట్టుకుంటోంది. వాడు రౌడీ వాడి నాన్న రౌడీ వాడి తాత రౌడీ.. అంటూ క్యూట్ గా క‌వ్విస్తోంది ఈ బ్యూటీ. వెన్నెల కిషోర్ - వైవా హ‌ర్ష- వెన్నెల కిషోర్ త‌దిత‌రుల కామెడీ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ఇందులో పోలీస్ లు ఛేజ్ లు ఎందుకు అన్నది తెర‌పైనే చూడాలి. ఇంత‌కీ ప్రేమించిన యువ‌తి కోసం రౌడీగా మారిన సందీప్ చివ‌రికి ఆశించిన‌ది ద‌క్కించుకున్నాడా లేదా? అన్న‌ది కూడా థియేట‌ర్ కి వెళ్లి చూడాలి. సెప్టెంబ‌ర్ 17న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

గ‌ల్లీ రౌడీ ట్రైల‌ర్ పై మెగాస్టార్ ప్ర‌శంస‌లు

సందీప్ కిషన్ తాజా చిత్రం `గల్లీ రౌడీ`. సందీప్ తోనే తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.ఎల్ తెర‌కెక్కించిన‌ డైరెక్టర్ జి నాగేశ్వర్ రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎంవివి సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రాన్ని కోన వెంకట్ స‌మ‌ర్పిస్తున్నారు. కోన ఈ చిత్రానికి ర‌చ‌యిత‌. నేడు గ‌ల్లీ రౌడీ ట్రైల‌ర్ ని మ‌న అంద‌రి అభిమాన `స్టేట్ రౌడీ` మెగాస్టార్ చిరంజీవి ఆవిష్క‌రించి టీమ్ ని విష్ చేశారు.

ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ కి చిత్ర‌బృందం కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. చిరంజీవి మాట్లాడుతూ-``గ‌ల్లీ రౌడీ టైటిల్ వెరైటీగా ఆస‌క్తిక‌రంగా ఉంది. ఈ ట్రైల‌ర్ ని విడుద‌ల చేయ‌డం సంతోషం.. కోన ర‌చ‌యిత‌గా స‌మ‌ర్ప‌కుడిగా ఎంవీవీ నిర్మాత‌గా జి.నాగేశ్వ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమా ట్రైల‌ర్ చూశాను. గ‌ల్లీరౌడీ ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా ఉంది. మంచి కోసం రౌడీయిజం చేసే కుటుంబంలో పుట్టిన ఒక కుర్రాడు అస‌లు త‌న‌కు అది ఇష్టం లేని వాడు అమ్మాయిని ప్రేమించి ప్రేమ‌కోసం రౌడీగా ఎలా మారాడు? రౌడీగా మార‌డం వ‌ల్ల ఆ కుటుంబానికి జ‌రిగిన మేలేంటి? అన్న‌దే క‌థాంశం. మంచి కోసం రౌడీగా మారిన గ‌ల్లీ రౌడీ క‌థ ఆస‌క్తిని క‌లిగిస్తోంది. సందీప్ కిష‌న్ అండ్ టీమ్ కి విజ‌యం అందుకుంటుంది.. ఆల్ ది బెస్ట్`` అని అన్నారు. సాయి కార్తీక్- చౌరాస్త రామ్ సంయుక్తంగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సందీప్ న‌టించిన ఏ1 ఎక్స్ ప్రెస్ కంటెంట్ బావున్నా ఆశించినంత విజ‌యం సాధించ‌లేదు. ఈసారి ఎట్టి ప‌రిస్థితిలో హిట్టు కొట్టాల‌నే క‌సితో ఉన్నాడు. గ‌ల్లీ రౌడీ కోసం సందీప్ చాలా హార్డ్ వ‌ర్క్ చేశార‌ని ట్రైల‌ర్ తో అర్థ‌మ‌వుతోంది.