Begin typing your search above and press return to search.

ట్రైలర్.. C/o న్యాచురల్ స్టార్

By:  Tupaki Desk   |   25 Sept 2017 6:00 AM IST
ట్రైలర్.. C/o న్యాచురల్ స్టార్
X
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ అదృష్టం ఏమిటో గాని జయపజయలతో సంబంధం లేకుండా సినిమాలను చేస్తున్నాడు. ఏ మాత్రం అలసత్వం లేకుండా బిజీ బిజీ షెడ్యూల్ తో గడుపుతున్నాడు. కెరీర్ మొదట్లో కాస్త విజయాలను అందుకున్నా ఆ తర్వాత అపజయలతో సతమతమవుతున్నాడు. అయితే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని యాక్షన్ డ్రామా ఫిల్మ్ తో రాబోతున్నాడు. C/o సూర్య అనే సినిమాను ఒకేసారి తమిళ్ తెలుగులో రిలీజ్ చేయబోతున్నాడు.

ఈ సినిమాకు సందీప్ ప్రమోషన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీలుకుంటున్నాడట. గత చిత్రాల అపజయాలు కొంచెం ప్రమోషన్స్ ఎఫెక్ట్ పడ్డట్లు కామెంట్స్ వచ్చాయి. దీంతో ఈ యువ హీరో కాస్త హై లెవెల్ లో ప్రమోషన్స్ ని నిర్వహించనున్నాడట. ముందుగా ట్రైలర్ ని న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా రిలీజ్ చేయించడానికి రెడీ అయ్యాడు. వరస హిట్స్ తో దూసుకుపోతున్న నాని ఇమేజ్ ఇప్పుడు మాములుగా లేదు. దీంతో మనోడు నాని క్రేజ్ ను వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఈ సినిమాను నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సుసీంద్రన్ తెరకెక్కించాడు. ఇక సందీప్ కిషన్ కి జోడిగా 'కృష్ణ గాడి వీర ప్రేమ గాధ' హీరోయిన్ మెహ్రీన్ పీర్జాద కనిపించనుంది. తమిళ్ మెలోడీ రాజా ఇమ్మన్ సంగీతాన్ని అందిస్తున్నారు.