Begin typing your search above and press return to search.

వినాయక్ అమ్మేశాడు.. సందీప్ కొనేశాడు

By:  Tupaki Desk   |   14 March 2016 3:44 AM GMT
వినాయక్ అమ్మేశాడు.. సందీప్ కొనేశాడు
X
మధ్య తరగతి నుంచి పై స్థాయికి ఎదుగుతున్న చాలామందికి.. కోరికలు, లక్ష్యాలు ఒకే టైపుగా కనిపిస్తాయి. సొంతిల్లు, కారు.. ఇలా ఉంటుంది లిస్ట్. ఇప్పుడు కుర్ర హీరో సందీప్ కిషన్ వరుసగా తన కలలను నెరవేర్చుకుంటున్నాడు. తన కష్టార్జితంతో ఇప్పుడో ఇల్లు కొనుక్కున్నాడు. స్పోర్ట్స్ కారు - హోమ్ థియేటర్ వంటి డ్రీమ్స్ కూడా కుర్రాడికి ఇప్పుడే నెరవేరాయి.

'మధ్య తరగతి నుంచి వచ్చిన నాకు సొంతిల్లు - కారు లాంటివన్నీ పెద్ద లక్ష్యాలుగా ఉండేవి. అందుకే ఇప్పుడు వాటిని ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు మాదాపూర్ లో ఓ ఫోర్ బెడ్ రూం అపార్ట్ మెంట్ కొనుక్కున్నా. నిజానికి ఈ ఫ్లాట్ తో నాకు సెంటిమెంట్ ఉంది. ఇది మా అంకుల్ హౌజ్. చిన్నపుడు ఏదో ఒక రోజు దీన్ని కొనేస్తా అనేవాడిని. మా అంకుల్ దీన్ని వివి వినాయక్ కు అమ్మేశారు. ఆయన్నుంచి నేను కొనుక్కున్నాను' అని చెప్పాడు సందీప్ కిషన్.

దుర్గం చెరువు వ్యూ ఉండేలా ఈ ఫ్లాట్.. కుర్రోళ్లకి పర్ఫెక్ట్ పార్టీ ఏరియా అంటున్నాడు సందీప్. మిని కాఫీ బార్ - పార్టీ ఏరియా - లాన్ - వర్కవుట్ స్పేస్.. ఇలా అన్నీ ఉన్నాయట. అంతే కాదు హోమ్ థియేటర్ కోసం ఓ రూమ్ కేటాయించాడు కూడా. ఇప్పుడా ఇంటికి తనకు నచ్చినట్టుగా గ్రీక్ ఇంటీరియర్లతో ఫినిషింగ్ ఇస్తున్నాడు ఈ హీరో. అసలు తాను తన డబ్బంతా హాలీడే టూర్లకే పెట్టేస్తూ ఉంటానని.. ఇలా డబ్బు దాచి ఇల్లు కొనడం తనకే ఆశ్చర్యంగా ఉందని చెబ్తున్నాడు సందీప్ కిషన్.