Begin typing your search above and press return to search.

సినిమా కోసం 12 కిలోల బరువు తగ్గిన యంగ్ హీరో...!

By:  Tupaki Desk   |   19 Jun 2020 3:59 PM GMT
సినిమా కోసం 12 కిలోల బరువు తగ్గిన యంగ్ హీరో...!
X
టాలీవుడ్‌ లో ఒకప్పటి హీరోస్ ఫిజిక్ మీద బాడీ మీద పెద్దగా ఫోకస్ చేసేవారు కాదు. అయితే మారుతున్న కాలంతో పాటు యాక్టర్స్ కూడా వర్కౌట్స్ చేస్తూ బాడీ మీద దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలు సిక్స్ ప్యాక్‌ లు చేశారు. ఈ జాబితాలో కొంత మంది యంగ్ హీరోలు కూడా ఉన్నారు. లేటెస్టుగా యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా సిక్స్ ప్యాక్ క్లబ్‌ లో చేరారు. ఇప్పటి వరకు సాధారణ శరీరాకృతితో కనిపించిన సందీప్.. ఇప్పుడు ఒక్కసారిగా ఆరు పలకల దేహంతో ఆకట్టుకుంటున్నారు. అయితే తన బాడీని ఈ రకంగా మార్చడానికి సందీప్ ఏకంగా 12 కేజీల బరువు తగ్గారట. ఫిట్‌ నెస్ ట్రైనర్ కుల్దీప్ సేథి ఆధ్వర్యంలో సందీప్ తన బాడీ ఈ విధంగా మలిచారని తెలుస్తోంది. సందీప్ కిషన్ తన సిక్స్ ప్యాక్ లుక్‌ ను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి.. ''ప్రతి ఛాంపియన్ ఒకప్పుడు ఓడిపోవడానికి నిరాకరించిన పోటీదారుడే'' అని రాకీ బాల్బోవ క్యాప్షన్ కూడా పెట్టారు.

కాగా సందీప్ కిషన్ ఈ లుక్ 'ఎ1 ఎక్స్‌ ప్రెస్' సినిమా కోసం రెడీ చేసాడు. జాతీయ క్రీడ హాకీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ హాకీ ప్లేయర్‌ గా కనిపించనున్నారు. పర్ఫెక్ట్ హాకీ ప్లేయర్ గా కనిపించడం కోసం ఈ కరోనా సమయాన్ని ఉపయోగించుకున్నాడు సందీప్. డైలీ వర్కౌట్స్ చేస్తూ 12 కిలోల బరువు తగ్గాడు. ఇక 'ఎ1 ఎక్స్‌ ప్రెస్' సినిమాలో 'అందాల రాక్షసి' లావణ్య త్రిపాఠి హీరోయిన్‌ గా నటిస్తున్నారు. ఆమె కూడా హాకీ క్రీడాకారిణిగా కనిపిస్తారని సమాచారం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు నిర్మిస్తున్న ఈ సినిమాకు డెన్నిస్ జీవన్ దర్శకత్వం వహిస్తున్నారు. హిప్ హాప్ తమిజ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మధ్య సరైన సక్సెస్ లేక ఇబ్బందులు పడుతున్న సందీప్ ఈ సినిమా కోసం పడుతున్న కష్టానికైనా మంచి విజయం దక్కుతుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.