Begin typing your search above and press return to search.

యంగ్‌ హీరో ప్రొడక్షన్‌ నెం.3 అధికారిక ప్రకటన

By:  Tupaki Desk   |   17 Aug 2020 2:43 PM GMT
యంగ్‌ హీరో ప్రొడక్షన్‌ నెం.3 అధికారిక ప్రకటన
X
హీరోగా సందీప్‌ కిషన్‌ సక్సెస్‌ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కెరీర్‌ ఆరంభం నుండి అతడు సక్సెస్‌ ఫ్లాప్స్‌ తో కెరీర్‌ ను నెట్టుకు వస్తున్నాడు. సక్సెస్‌ ల విషయంలో కాస్త వెనుకబడి ఉన్న సందీప్‌ కిషన్‌ తో సినిమాలంటే నిర్మాతలు కాస్త జంకుతున్నారు. దాంతో ఆయనే సొంతంగా నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి తన సినిమాలను తానే నిర్మించుకునేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ‘నిను వీడని నీడను నేనే’ అనే చిత్రాన్ని నిర్మించాడు. ఆ సినిమా కమర్షియల్‌ గా ఆశించిన స్థాయిలో ఆడలేదు. కాని సందీప్‌ కు మాత్రం భారీ నష్టాలను అయితే మిగల్చలేదు.

ఆ సినిమా ఇచ్చిన ధైర్యంతో ప్రస్తుతం తన ‘ఎ1 ఎక్స్‌ ప్రెస్‌’ సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు అతడి వెంకటాద్రి టాకీస్‌ బ్యానర్‌ పై మూడవ సినిమాకు సిద్దం అయ్యాడు. ప్రొడక్షన్‌ నెం.3 గా ‘వివాహ భోజనంబు’ అనే చిత్రాన్ని చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన చేశాడు. రామ్‌ అబ్బరాజు రూపొందిస్తున్న ఈ చిత్రంలో సందీప్‌ కిషన్‌ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అందుకు సంబంధించిన చిత్రీకరణ త్వరలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

సందీప్‌ కిషన్‌ కు తెలుగు రాష్ట్రాల్లో వివాహ భోజనంబు పేరుతో రెస్టారెంట్‌ చైన్‌ ఉన్న విషయం తెల్సిందే. ఇప్పుడు అదే పేరుతో సందీప్‌ సినిమాను చేసేందుకు సిద్దం అవ్వడం జరిగింది. రెస్టారెంట్‌ బిజినెస్‌ లో సక్సెస్‌ అయిన సందీప్‌ కిషన్‌ ఈ టైటిల్‌ తో సినిమా కూడా కమర్షియల్‌ సక్సెస్‌ అవుతుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.