Begin typing your search above and press return to search.

మళ్ళీ కొత్త సినిమా అనౌన్స్ చేశాడు

By:  Tupaki Desk   |   17 Jun 2017 10:48 AM IST
మళ్ళీ కొత్త సినిమా అనౌన్స్ చేశాడు
X
సందీప్ కిషన్ హీరోగా కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. కెరీర్ మొదట్లో స్పీడ్ చూపించిన ఈ కుర్రాడు.. ఆ తర్వాత స్లో అయిపోయాడు. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డ సందీప్ కిషన్ కు తెలుగు సినిమాలు తగ్గిపోయినా.. అదే సమయంలో తమిళ్ లో ఆఫర్లు వరుసగా వచ్చాయి. ఇప్పుడు మళ్లీ తెలుగులో బిజీ అవుతున్నాడు ఈ కుర్రహీరో. ఆల్రెడీ మంజుల డైరక్షన్లో సినిమా.. కునాల్ కొహ్లీ సినిమా.. శమంతకమణి మూవీ.. ఇలా చాలా ఉండగా.. ఇప్పుడు మరో కొత్త సినిమా వచ్చిపడింది.

తాజాగా తన కొత్త సినిమాను సందీప్ కిషన్ అనౌన్స్ చేశాడు. దొంగాట.. కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్రాలకు దర్శకత్వం వహించిన వంశీకృష్ణ డైరెక్షన్ లో మూవీ చేయనున్నాడు ఈ హీరో. ఈ చిత్రాన్ని రూపేష్ డి గొహిల్ నిర్మించనున్నాడు. గతంలో ఈయన బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం.. సినిమా చూపిస్త మామ చిత్రాలను నిర్మించాడు. ఇప్పటికే ప్రాజెక్టును అనౌన్స్ చేసేయగా.. జూన్ 20 నుంచి షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు తెలిపాడు సందీప్ కిషన్. నేను లోకల్ చిత్రానికి రైటర్ గా వర్క్ చేసిన ప్రసన్న కుమార్ బెజవాడ.. సందీప్ కొత్త సినిమాకి కథ- మాటలు అందించడం విశేషం.

ఫ్యామిలీ ఎంటర్టెయినర్ జోనర్ లో ఈ మూవీ తెరకెక్కనుండగా.. ఈ సినిమాలో మెజారిటీ భాగాన్ని హైద్రాబాద్ లోనే షూటింగ్ చేయనున్నారు. రతన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నీజర్ షఫీ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు. హీరోయిన్ తో పాటు ఇతర టీం మెంబర్లను త్వరలో ఫైనల్ చేయనున్నట్లు యూనిట్ తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/