Begin typing your search above and press return to search.
ఈ కుర్రాళ్లు కూడా కుమ్మేస్తారా మరి!!
By: Tupaki Desk | 13 Jun 2018 11:28 AM ISTగతంలో టాలీవుడ్ హీరోలు బిగుసుకుపోయి కూర్చునే వారు. అవార్డు ఈవెంట్లు.. సినిమా ఫంక్షన్స్ లో అందరూ చీఫ్ గెస్టుగా మాదిరిగా వచ్చి వెళ్లే వారు. కానీ కొత్త జనరేషన్ వచ్చాక ట్రెండ్ మారుతోంది. బాలీవుడ్ తరహాలో ఇక్కడ కూడా అవార్డ్ ఈవెంట్స్ ను నిర్వహించేందుకు కుర్రకారు సై అంటున్నారు.
అల్లు శిరీష్ మొదట ఈ ట్రెండ్ ను స్టార్ట్ చేశాడు. తన స్టైల్ కామెడీ టైమింగ్ తో అలరించాడు. ఈ ఈవెంట్ శిరీష్ కెరీర్ కు కూడా ఉపయోగపడిందని చెప్పవచ్చు. ఆ తర్వాత నాని- రానా కలిసి కూడా బాగానే హంగామా చేయడం చూశాం. ఈ రెండు కార్యక్రమాలు తెలుగు టెలివిజన్ లో రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు మరో ఇద్దరు కుర్ర హీరోలు తమ అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం తన కెరీర్ ను గాడిలో పెట్టుకోవాల్సిన స్థితిలో ఉన్న సందీప్ కిషన్ వీరిలో ఒకరు.
తమిళనాడు నుంచి వచ్చి తెలుగులో హీరోగా సెటిల్ అయేందుకు కష్టపడుతున్న రాహుల్ రవీంద్రన్ కూడా ఈ కార్యక్రమంలో భాగం అవుతున్నాడు. జూన్ 16న ఈ అవార్డు ఈవెంట్ జరగనుండగా.. ఇప్పటికే వీరిద్దరూ బోలెడంత హోమ్ వర్క్ గ్రౌండ్ వర్క్ చేసి.. ఈవెంట్ ను రన్ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే.. ఈ షో టీవీల్లో టెలికాస్ట్ అయ్యేందుకు మాత్రం మరికొంత సమయం పడుతుంది.
