Begin typing your search above and press return to search.

రిలీజైన సినిమా.. మళ్ళీ రిలీజ్ చేస్తారా?

By:  Tupaki Desk   |   17 Nov 2017 11:41 AM IST
రిలీజైన సినిమా.. మళ్ళీ రిలీజ్ చేస్తారా?
X
టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ పరిస్థితి ఎలా ఉందొ అందరికి తెలిసిందే. కెరీర్ మొదట్లో వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో హిట్ అందుకున్నాడంటే ఇప్పటివరకు హిట్టు అందుకోలేదు. ఇక మనోడి అదృష్టం ఏమిటో గాని కోలీవుడ్ లో పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తున్నాడు. కొత్త తరహా కథలను కూడా బాగానే చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా తెలుగులో కేరాఫ్ సూర్యతో తెలుగు ఆడియెన్స్ ని పలకరించాడు.

తమిళ్ లో కూడా నెంజిల్ తునివిరుందల్ అనే టైటిల్ తో రిలీజ్ అయ్యింది. అయితే సినిమా ఆడియోన్స్ నుండి మిక్సిడ్ టాక్ ను తెచ్చుకుంది. సినిమాలో కొన్ని అనవసర సన్నివేశాలను ఉన్నాయని టాక్ రావడంతో దర్శకుడు కొన్ని సీన్స్ ని కట్ చేయించాడు. అయితే అందులో ఎక్కువగా హీరోయిన్ మెహ్రీన్ సన్నివేశాలను తొలగించడం ఆశ్చర్యానికి గురి చేసింది. సక్సెస్ ట్రాక్ లో ఉన్న హీరోయిన్ సీన్స్ తీసెయ్యడంపై మీడియాల్లో కథనాలు కూడా వెలువడ్డాయి.

అయితే ముందే దర్శకుడు సుశీంద్రన్ హీరోయిన్ కి క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఫైనల్ గా సినిమా మొత్తాన్ని ఎడిట్ చేసి తమిళనాడులో రీరిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. నెంజిల్ తునివిరుందల్ డిసెంబర్ 15న మరోసారి కొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అసలు ఒకసారి ధియేటర్లలోకి వచ్చిన సినిమాను తీసేసి.. మళ్ళీ రిలీజ్ చేయడం అంటే.. వామ్మో ఇదేదో చాలా డిఫరెంట్ అండ్ క్రేజీగా ఉందే.