Begin typing your search above and press return to search.

నాని 'అంటే.. సుందరానికీ!' కోసం ఏకంగా ఏడు రిలీజ్ డేట్స్..!

By:  Tupaki Desk   |   3 Feb 2022 4:50 PM GMT
నాని అంటే.. సుందరానికీ! కోసం ఏకంగా ఏడు రిలీజ్ డేట్స్..!
X
'శ్యామ్ సింగరాయ్' సక్సెస్ జోష్ లో ఉన్న నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ''అంటే.. సుందరానికీ!''. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదల తేదీకి సంబంధించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.

కరోనా నేపథ్యంలో వాయిదా పడిన పెద్ద సినిమాలన్నీ ఈ మధ్య వరుసగా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొందరు నిర్మాతలు తమ సినిమాలకు ఒకటికి రెండు తేదీలపై కర్చీఫ్స్ వేశారు. ఈ క్రమంలో 'అంటే.. సుందరానికీ!' సినిమా కోసం మేకర్స్ ఏడు డేట్స్ ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాని ట్వీట్ చేస్తూ.. ''మీరు అంతా రెండు రెండు బ్లాక్ చేస్తే.. మేము ఏడు చేయకూడదా.. ఫుల్ ఆవకాయ సీజన్ బ్లాక్ చేసాం. మెల్లగా డిసైట్ చేస్తాం'' అంటూ సెటైరికల్ ఫన్నీ ట్వీట్ పెట్టారు.

ఈ మేరకు వదిలిన 'అంటే.. సుందరానికీ!' సినిమా రిలీజ్ డేట్స్ అనౌన్సమెంట్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఎర్రటి చొక్కా - పంచె కట్టులో వైవిధ్యమైన గెటప్ లో కనిపిస్తున్న నాని.. ఏ తేదీకి రావాలో అని ఆలోచిస్తున్నట్లు నిలబడి ఉన్నాడు. 2022 ఏప్రిల్ 22 లేదా ఏప్రిల్ 29 లేదా మే 6 లేదా మే 20 లేదా మే 27 లేదా జూన్ 3 లేదా జూన్ 10 లలో ఏదొక తేదీలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని పేర్కొన్నారు.

కాగా, 'అంటే.. సుందరానికీ!' చిత్రంలో K.P.V.S.S.P.R సుందర ప్రసాద్ అనే పాత్రలో నాని కనిపించనున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా విడుదలైన జీరోత్ లుక్ మోషన్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. హీరో పాత్ర హిలేరియస్ గా ఉండబోతోందని హింట్ ఇచ్చారు. ఇందులో నాని సరసన నజ్రియా నజీమ్ ఫహద్ హీరోయిన్ గా నటిస్తోంది. నదియా - హర్షవర్ధన్ - రాహుల్ రామకృష్ణ - సుహాస్ తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్ పై నవీన్‌ యెర్నేని - వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ర‌వితేజ గిరిజాల ఎడిట‌ర్‌ గా వర్క్ చేస్తున్నారు. లతా నాయుడు ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. 2022 ఆవకాయ్ సీజన్ లో రాబోతున్న 'అంటే సుందరానికీ' సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.