Begin typing your search above and press return to search.

తమిళ ‘బాహుబలి’ అక్కడ మొదలవుతోంది

By:  Tupaki Desk   |   9 May 2017 9:03 AM GMT
తమిళ ‘బాహుబలి’ అక్కడ మొదలవుతోంది
X
ఇండియన్ సినిమాలో ఏ కొత్త ప్రయోగమైనా.. ఏ భారీ ప్రయత్నమైనా తమ దగ్గరే మొదలవ్వాలని కోరుకుంటారు తమిళ ఫిలిం మేకర్స్. ఐతే ‘బాహుబలి’తో రాజమౌళి వాళ్లు అందుకోలేని స్థాయికి తెలుగు సినిమాను తీసుకెళ్లి నిలబెట్టేశాడు. ఒక తెలుగు డబ్బింగ్ సినిమా తమిళనాట సాగిస్తున్న ప్రభంజనం చూసి విస్తుపోతోంది కోలీవుడ్. ‘బాహుబలి’ని కొట్టే సినిమా తీయాలని అక్కడివాళ్లు పట్టుదలతో ఉన్నారు. ఆల్రెడీ ‘పులి’ అనే ఒక సినిమా ట్రై చేశారు కానీ.. అది బెడిసికొట్టింది. మరోవైపు శంకర్ ‘రోబో-2’తో ‘బాహుబలి’ని బీట్ చేస్తాడన్న ఆశతో ఉన్నారు అక్కడి జనాలు. ఐతే అచ్చం బాహుబలి తరహాలోనే రాజులు.. రాజ్యాల కథతో సీనియర్ దర్శకుడు సుందర్ కూడా ఒక సినిమాకు శ్రీకారం చుడుతున్న సంగతి తెలిసిందే. అదే.. సంఘమిత్ర.

రెండేళ్లకు పైగా ‘సంఘమిత్ర’ కోసం పని చేస్తున్న సుందర్.. ఎట్టకేలకు ఆ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లడానికి రంగం సిద్ధం చేశాడు. మరో వారం రోజుల్లోనే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఐతే లాంచింగ్ దగ్గరే ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావాలని.. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ను వేదికగా చేసుకుంది చిత్ర బృందం. అక్కడే ఈ సినిమా లోగో లాంచ్ చేసి.. ప్రారంభోత్సవం జరపనున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ తెండ్రాల్ ఫిలిమ్స్ అందుకు సన్నాహాలు చేస్తోంది. దర్శకుడు సుందర్ తో పాటు హీరోలు జయం రవి.. ఆర్య.. హీరోయిన్ శ్రుతి హాసన్ అక్కడ సందడి చేయబోతున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకే షూటింగ్ కూడా మొదలుపెట్టేయనున్నారు. బడ్జెట్ ఎంత అని చెప్పలేదు కానీ.. ఇండియాలో ఇ్పటిదాకా వచ్చిన సినిమాల కంటే ఇదే కాస్ట్లీ ఫిలిం అంటున్నాడు సుందర్.