Begin typing your search above and press return to search.

బాహుబలి, రోబో-2 కన్నా పెద్ద సినిమా అట

By:  Tupaki Desk   |   16 Jun 2016 1:30 PM GMT
బాహుబలి, రోబో-2 కన్నా పెద్ద సినిమా అట
X
తమిళ సీనియర్ డైరెక్టర్ సుందర్.సి.. సూర్య కథానాయకుడిగా భారీ బడ్జెట్లో ‘బాహుబలి’ తరహాలో హిస్టారికల్ మూవీ తీయబోతున్నట్లు కొన్ని రోజుల కిందట వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు గురించి సుందర్ తాజాగా పెద్ద ఇంటర్వూ ఇచ్చాడు. ఐతే ఇప్పటిదాకా ఇది ‘బాహుబలి’ స్థాయి సినిమా అని మాత్రం అనుకుంటుండగా సుందర్ మాత్రం బాహుబలి - రోబో-2ల కంటే కూడా ఇది బిగ్ ప్రాజెక్ట్ అంటున్నాడు. ఇండియాలో ఇప్పటిదాకా ఏ సినిమా తెరకెక్కనంత భారీగా ఈ సినిమా తెరకెక్కబోతోందని అతను చెప్పాడు. ఇప్పటికే ఏడెనిమిది నెలలుగా ఈ సినిమా కోసం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని. వచ్చే ఏడాది మార్చిలో సినిమాను మొదలుపెట్టి రెండేళ్ల తర్వాతి రిలీజ్ చేస్తామని అతను వెల్లడించాడు. ఇంకా ఈ ప్రాజెక్టు గురించి అతనేమన్నాడంటే..

‘‘బడ్జెట్ ఎంత అన్నది కమిట్ కాను. అది నిర్మాణ సంస్థ తెండ్రాల్ ఫిలిమ్సే ప్రకటించాలి. ఐతే ఇండియాలో ఇప్పటిదాకా వచ్చిన అన్ని సినిమాల కంటే.. బాహుబలి - రోబో-2ల కంటే భారీ బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఆర్టిస్టుల విషయంలో ఇప్పుడేమీ చెప్పలేను. ఐతే భారీ స్టార్ కాస్ట్ ఉంటుంది. సూర్య విషయం కూడా ఇప్పుడే కన్ఫమ్ చేయలేదు. ఐతే సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అయిన ఒక ఇందులో నటిస్తాడు. సాబు సిరిల్ సార్ ఆర్ట్ డైరెక్షన్ చేస్తారు. కణల్ కణ్ణన్ విజువల్ ఎఫెక్ట్స్ అందిస్తారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. వచ్చే నెలలో సినిమా గురించి పూర్తి వివరాలు వెల్లడిస్తాం. మార్చిలో షూటింగ్ మొదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వందల మంది ఈ సినిమా కోసం ఇప్పటికే పని చేస్తున్నారు. యుఎస్ - బాంబే - హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వర్క్ నడుస్తోంది’’ అని సుందర్ చెప్పాడు.