Begin typing your search above and press return to search.

మగాళ్ల మతి పోగొడ్తున్న సుమతీ సాంగ్..!

By:  Tupaki Desk   |   22 May 2023 11:16 PM IST
మగాళ్ల మతి పోగొడ్తున్న సుమతీ సాంగ్..!
X
న్యూస్ యాంకర్ గా కెరియర్ ప్రారంభించి.. జబర్దస్త్ షో ద్వారా బోల్డ్ అండ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్. ఈ ఒక్క షోతే అమ్మడి రేంజ్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఇదే హవా వెండితెరపై కూడా కొనసాగుతోంది. అద్భుతమైన పాత్రల్లో నటిస్తూ అందరి చేత ఆహా అనిపిస్తోంది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా కనిపించి.. అందిరినీ మెప్పించింది. ఆ తర్వాత పుష్ప సినిమాలో విలన్ కు భార్యగా అదరగొట్టింది.

వరుస సినిమాలతో అద్భుతంగా నటిస్తూ దూసుకెళ్తున్న అనసూయ తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ్సతోంది. అనసూయ ప్రధాన పాత్రలో రాబోతున్న ఈ చిత్రం పేరు విమానం. ఈ సినిమాలో అనసూయ సుమతిగా కనిపించబోతుంది. ఆమె అందాల ఆరబోత చూస్తుంటే పిచ్చెక్కిపోవడం ఖాయమని ఇప్పటికే ఈ చిత్రబృందం వదిలిన అప్ డేట్లు స్పష్టం చేశాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో లేటెస్ట్ అప్ డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాలోని సుమతీ లిరికల్ సాంగ్ ను తాజాగా విడుదల చేశారు. ఈ పాటలో అనసూయ అందాలును హైలెట్ చేశారు. ముఖ్యంగా ఎద, నడుము అందాలను విపరీతంగా చూపించేశారు. నీ నడుములోని మడతా.. సూస్తే ప్రాణమురికే వనితా అంటూ వచ్చే సాంగ్ నిజంగా అద్భుతంగా ఉంది. పాటలో సుమతిని చెప్పులతో పోలుస్తూ ఆమె అందాల గురించి వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.

నా కొట్టు చిన్నదైనా.. ప్రేమ గట్టిదమ్మ సుమతీ అంటూ పాట చివర్లో చెప్పే లైన్స్ చూస్తుంటే.. ఈ సినిమాలో హీరోకు అనసూయ అంటే ఎంత ఇష్టమో తెలుస్తోంది. శివప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో డైరెక్టర్ అండ్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని అంగ వైకల్యం ఉన్న తండ్రి పాత్రలో కనిపిస్తున్నారు.

తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం, ఆ కుమారుడి విమానం ఎక్కాలన్న కోరిక చుట్టూ సినిమా సాగుతుందని ఇప్పటికే విడుదలైన సినిమాలు చూస్తే అర్థం అవుతోంది. అయితే తండ్రి పాత్రలో సుముద్రఖి, ఆయన కుమారుడి పాత్రలో మాస్టర్ ధ్రువన్ నటించబోతున్నారు. రాజేంద్రన్ పాత్రలో రాజేంద్రన్, డేనియల్ పాత్రలో ధన్ రాజ్, కోటి పాత్రలో రాహుల్ రామకృష్ణ నటించి మెప్పించేందుకు సిద్ధంగా ఉన్నారు.