Begin typing your search above and press return to search.
సరైన దారిలో వెళ్తున్నాం.. ఆధరించండి
By: Tupaki Desk | 2 Dec 2018 5:16 PM ISTసరైన బ్రేక్ కోసం చాలా కాలంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న సుమంత్ నటించిన తాజా చిత్రం ‘సుబ్రమణ్యపురం’. గతంలో ఎప్పుడు లేని విధంగా సుమంత్ సినిమాకు ఈసారి చాలా క్రేజ్ ఉంది. విభిన్నమైన కథాంశంతో, ఆసక్తికర నేపథ్యంతో ఈ చిత్రంను తెరకెక్కించడం వల్ల సినిమాపై సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఉంది. ట్రైలర్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేసింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం తప్పకుండా ఒక కమర్షియల్ సక్సెస్ గా నిలుస్తుందనే నమ్మకంను సుమంత్ వ్యక్తం చేస్తున్నాడు.
తాజాగా సుమంత్ మీడియాతో మాట్లాడుతూ.. తమ సినిమాను లిప్ కిస్ తో - రొమాంటిక్ సీన్స్ తో ప్రచారం చేయడం లేదు. వివాదాస్పద అంశాలు అసలే లేవు. మేము కంటెంట్ నమ్ముకుని సరైన మార్గంలో సినిమాను తెరకెక్కించాం. ఇప్పుడు కూడా అదే కంటెంట్ పై నమ్మకంతో ఎలాంటి పక్క దారులు పట్టకుండా సరైన దారిలో సినిమాను ప్రమోట్ చేసి, ప్రేక్షకులకు చేరువ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నామన్నాడు.
మా సినిమాలో కాంట్రవర్సీకి, రొమాన్స్ కు స్థానం లేదని, ఇదో థ్రిల్లర్ కథాంశంతో రూపొందింది. వివాదాల వల్ల సినిమాలకు పబ్లిసిటీ వచ్చే అవకాశం ఉంది తప్ప, కంటెంట్ లేకున్నా కూడా కలెక్షన్స్ అయితే రావని, ముద్దు సీన్స్, రొమాంటిక్ సీన్స్ విషయంలో కూడా అంతే అని, సినిమాలో కంటెంట్ ఉంటేనే సక్సెస్ దక్కుతుంది. ఆ కంటెంట్ మా సినిమాలో ఉందనే నమ్మకంను సుమంత్ వ్యక్తం చేస్తున్నాడు.