Begin typing your search above and press return to search.

అక్కినేని హీరో సినిమాకి మోక్షం లభించేనా...?

By:  Tupaki Desk   |   17 July 2020 11:30 AM IST
అక్కినేని హీరో సినిమాకి మోక్షం లభించేనా...?
X
అక్కినేని కాంపౌండ్ నుండి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరోలలో సుమంత్ ఒకరు. 'ప్రేమకథ' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సుమంత్ విభిన్నమైన చిత్రాలను సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్నారు. 'సత్యం' 'పౌరుడు' 'గౌరీ' 'మధుమాసం' 'గోల్కొండ హైస్కూల్' 'గోదావరి' 'మళ్ళీరావా' వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన 'సుబ్రహ్మణ్యపురం' 'ఇదమ్ జగత్' సినిమాలు నిరాశ పరిచాయి. ఈ క్రమంలో 'క‌ప‌ట‌దారి' అనే సినిమా అనౌన్స్ చేసాడు సుమంత్. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని క్రియేటివ్ ఎంటర్టైనర్స్ మరియు బొఫ్తా మీడియా బ్యానర్‌ పై ధనుంజయన్ నిర్మించారు. కన్నడ హిట్ సినిమా 'కావలధారి' సినిమాకు రీమేక్ గా రానున్న ఈ సినిమాలో నందిత శ్వేత హీరోయిన్ గా నటించింది. ఎమోషనల్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమాకి 'క‌ప‌ట‌దారి' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్ట‌డంతో అప్ప‌ట్లో ఫిల్మ్ స‌ర్కిల్స్ లో ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా సైలెంట్ అయిపోయింది.

కాగా ఈ ప్రాజెక్ట్ గురించి అంతా మ‌రిచిపోయార‌నే అనుకునే టైమ్ లో సుమంత్ సోషల్ మీడియా వేదికగా 'క‌ప‌ట‌దారి' సినిమా అప్డేట్ ఇస్తూ.. ఈ సినిమా షూటింగ్ లాక్‌డౌన్ కంటే ముందే అయిపోయిందని.. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే మీ ముందుకు రాబోతుందంటూ వెల్లడించారు. ఇప్పుడు లేటెస్టుగా ఈ సినిమా ఆడియో రైట్స్ ప్ర‌ముఖ మ్యూజిక్ సంస్థ ఆదిత్య వారు కొన్నారంటూ మరో న్యూస్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. అయితే స‌మంత్ టైమ్ ఈ మధ్య అసలు బాలేదు.. ప్రస్తుత క్రైసిస్ పరిస్థితుల్లో 'క‌ప‌ట‌దారి' సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవడం కష్టమే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. మరి డిజిటల్ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ వారు కొంటారులే అనుకోడానికి కూడా ఇలాంటి టైటిల్స్ పై ఆసక్తి చూపిస్తారో లేదో అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మ‌రి 'క‌ప‌ట‌దారి' సినిమాని రెవెన్యూ షేరింగ్ విధానంలో ఏమైనా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.