Begin typing your search above and press return to search.

‘మళ్ళీ’ కమ్ బ్యాక్ అవుతాడా?

By:  Tupaki Desk   |   8 Dec 2017 6:14 AM GMT
‘మళ్ళీ’ కమ్ బ్యాక్ అవుతాడా?
X
రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో ఉన్నాడు అక్కినేని నాగార్జున మేనల్లుడు సుమంత్. కానీ ఇప్పటికీ అతను హీరోగా నిలదొక్కుకోలేదు. తొలిసారిగా ‘సత్యం’ సినిమాతో పెద్ద సక్సెస్ అందుకున్నాడు కానీ.. ఆ విజయాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. మళ్లీ ఫ్లాపులు తిన్నాడు. ఆ తర్వాత ‘గోదావరి’ సినిమాతో మళ్లీ పుంజుకునే ప్రయత్నం చేశాడు. కానీ తర్వాత మళ్లీ పడ్డాడు. గత కొన్నేళ్లలో అతడి మార్కెట్ బాగా పడిపోయింది. వరుస ఫ్లాపులు అతడి కెరీర్‌ ను బాగా దెబ్బ తీశాయి. చివరగా వచ్చిన ‘నరుడా డోనరుడా’ కూడా దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిలా ‘మళ్ళీ రావా’ అంటూ ఇంకో సినిమాతో వచ్చాడు సుమంత్.

ఈ రోజే విడుదలువుతున్న ఈ సినిమాపై సుమంత్ ధీమాగా ఉన్నాడు. ఈ సినిమాను ఇండస్ట్రీలోనే ప్రముఖులకు.. కొందరు ప్రెస్ వాళ్లకు ముందే చూపించారు. అందరూ చాలా పాజిటివ్ గా స్పందించారు. సుమంత్ కు ఇది కమ్ బ్యాక్ మూవీ అన్నారు. కానీ ఈ మధ్య ‘మెంటల్ మదిలో’కు కూడా విడుదలకు ముందే చాలా పాజిటివ్ గా రివ్యూలు వచ్చాయి. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. మరి ‘మళ్ళీ రావా’ ఏమవుతుందో చూడాలి. పెద్దగా పోటీ లేని సమయంలో రిలీజ్ చేస్తుండటం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. ఈ సినిమా ఆడకపోతే సుమంత్ కెరీర్ మరింత ఇబ్బందుల్లో పడుతుంది. ఇది డితే.. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న సుమంత్ మిగతా రెండు సినిమాలకు కలిసొస్తుంది. చూద్దాం మరి ఏమవుతుందో?